జీవితమంటేనే సమన్వయము. యోగమంటేనే శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టు "...సమత్వం యోగ ఉచ్యతే". ధాతువుల మధ్య, దోషముల మధ్య, విద్యుత్ ద్రవముల మధ్య, తత్వముల మధ్య, దేహాంగముల మధ్య, మస్తిష్క - నాడీ - మండలాదుల మధ్య సమన్వయము మరియు వాని సమతౌల్యమే జీవితము. జీవితమే యోగము. ప్రతీ కదలిక యోగమే, ప్రతి ఆలోచనా యోగమే.
ప్రస్తుతము చేతివేళ్ళ కలయిక, కదలిక, విన్యాసముల చేత "యోగ ముద్రలు" ని కూర్చుతున్నాను. ఒక్కొక్క ముద్ర ఒక రత్నము. అనేకమైన రత్నాలను ఏరి ఒక మాలగా కూర్చినది "యోగముద్రలు". అవి ఎటువంటి ముద్రలు? యోగముద్రలు. ఈ రాత్నాలహారము కూర్చే క్రమంలో నాట్యముద్రలు, గాయత్రీ ముద్రలు మొదలైన వానిని కూడా చేర్చినాను. మల్లెపూల దండలో మరువము మాదిరి, కొంత భిన్నమైన సౌరభాన్ని అందించాలన్నది నా ఆకాంక్ష.
జీవితమంటేనే సమన్వయము. యోగమంటేనే శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టు "...సమత్వం యోగ ఉచ్యతే". ధాతువుల మధ్య, దోషముల మధ్య, విద్యుత్ ద్రవముల మధ్య, తత్వముల మధ్య, దేహాంగముల మధ్య, మస్తిష్క - నాడీ - మండలాదుల మధ్య సమన్వయము మరియు వాని సమతౌల్యమే జీవితము. జీవితమే యోగము. ప్రతీ కదలిక యోగమే, ప్రతి ఆలోచనా యోగమే. ప్రస్తుతము చేతివేళ్ళ కలయిక, కదలిక, విన్యాసముల చేత "యోగ ముద్రలు" ని కూర్చుతున్నాను. ఒక్కొక్క ముద్ర ఒక రత్నము. అనేకమైన రత్నాలను ఏరి ఒక మాలగా కూర్చినది "యోగముద్రలు". అవి ఎటువంటి ముద్రలు? యోగముద్రలు. ఈ రాత్నాలహారము కూర్చే క్రమంలో నాట్యముద్రలు, గాయత్రీ ముద్రలు మొదలైన వానిని కూడా చేర్చినాను. మల్లెపూల దండలో మరువము మాదిరి, కొంత భిన్నమైన సౌరభాన్ని అందించాలన్నది నా ఆకాంక్ష.© 2017,www.logili.com All Rights Reserved.