మన జీవితంలో ఏది నిర్దేశించబడిందో ప్రస్తుతం ఏమి జరుగుతుందో అన్నది మనకు ఎన్నటికి తెలియదు. అదే జీవించడంలోని రహస్యం, జీవన సౌందర్యాలలోని ముఖ్య భాగం. నేను ఈ అరవై సంవత్సరాల జీవితంలో, ఎన్నో ఆశీస్సులు పొందాను. వాటిల్లో ఒకటి నేను యుక్తవయసులో, 1976 లో ఫార్మసీ చదువుకుంటున్నప్పుడు భారతదేశంలోని అహ్మదాబాద్ లో సంభవించింది. నా కళాశాలలోని ఒక సహ విద్యార్ధి పుణ్యం వలన, నేను హార్ట్ ఫుల్ నెస్ ధ్యానం గురించి తెలుసుకోవడం జరిగిన తరువాత కొద్దీ నెలలకు నేను ఒక అసాధారణమైన వ్యక్తిని ముఖాముఖి కలిసాను, ఆ క్షణమే వారు నా మొదటి గురువు అయ్యారు. వారే ఈ సాధనలో నన్ను ముందుకు నడిపించారు. వారు ఈ సాధనలో నాకు మార్గదర్శనం చేశారు. వారి పేరు రామ చంద్ర; మేము వారిని బాబూజీ అని పిలిచేవాళ్ళము.
నా మీద, మొట్టమొదటి హార్ట్ ఫుల్ నెస్ ధ్యానం యొక్క ప్రభావం ఎంత గాఢంగా పడిందంటే, నేను జీవితంలో నా మార్గాన్ని, గమ్యాన్ని కనుగొన్నాననే స్పష్టత వచ్చింది. కాని బాబూజీని కలవటం వలన కలిగిన ప్రభావం అంతకంటే గొప్పదైనది - అది వర్ణించడానికి వీలులేని, ఎంతో విలువైన, సూక్ష్మమైన సారం కలది.
- దాజీ, కమలేష్ డి. పటేల్