జననము, మరణము అను ఈ రెండు జీవితమండలి అతి ప్రధాన ఘట్టములు. జీవి రాకపోకలకు రూపము ఇదియే. ఈ ప్రక్రియకు మూలం 'ప్రాణం'. జీవిత విధానమంతా దానిపై ఆధారపడినడుస్తుంది. దీనిని నియంత్రించుటయే ప్రాణాయామ యోగము యొక్క ధ్యేయము. 'ప్రాణం' అనగా కేవలం శ్వాసకాదు. విశ్వం లోని శక్తియే ప్రాణం. ఇది నాడి చలనరూపంలో వ్యక్తమవుతుంది. ఇందు ఇంతవరకు మనం ఊహించని, కని, వినని, ఆచరించని సూక్ష్మమైన రహస్యాలు ఇమిడివున్నాయి.
'ప్రాణం' అను పద శబ్దం సర్వసాధారనంగా వినేమాట, అందరు ఉపయోగించే పదము. తరచూ ఈ పదాన్ని చాలా పరిమితమైన పరిధిలో, సందర్భాలలో, కుంచితమైన అర్థంతో ఉపయోగిస్తుంటారు. ప్రాణం అన్నది అతి సూక్ష్మ విషయం, పదార్ధం, అంతర్గతం కాబట్టి దానిని పట్టించుకోవడం లేదు. కాని ప్రాణం అనేది లేదని ఎవరు అనలేరు. కేవలం మరణ సమయంలో మాతరం ప్రాణం పోయింది అని అంటూ ఉంటాము. జన్మించినప్పుడు కూడా ఈ పదం వాడము. మృత్యువే దీనికి అధిపతి. మానవ శరీరాన్ని నడిపించే ఇంధన శక్తిలాంటి ఈ ప్రాణం ఎలాంటిదో ఈ పుస్తకం వలన గ్రహించవచ్చు. శరీర ఉపాధి, అంతర ప్రవృత్తికి సంబంధించిన నిగూఢ విషయాలు మాత్రము ప్రతి ఒక్కరికి కొత్తయే. ఈ ప్రాణ రహస్యములను, అద్భుత ప్రక్రియలను బహిర్గతం చేయడానికే ఈ చిన్న ప్రయత్నం.
- యోగశ్రీ
జననము, మరణము అను ఈ రెండు జీవితమండలి అతి ప్రధాన ఘట్టములు. జీవి రాకపోకలకు రూపము ఇదియే. ఈ ప్రక్రియకు మూలం 'ప్రాణం'. జీవిత విధానమంతా దానిపై ఆధారపడినడుస్తుంది. దీనిని నియంత్రించుటయే ప్రాణాయామ యోగము యొక్క ధ్యేయము. 'ప్రాణం' అనగా కేవలం శ్వాసకాదు. విశ్వం లోని శక్తియే ప్రాణం. ఇది నాడి చలనరూపంలో వ్యక్తమవుతుంది. ఇందు ఇంతవరకు మనం ఊహించని, కని, వినని, ఆచరించని సూక్ష్మమైన రహస్యాలు ఇమిడివున్నాయి. 'ప్రాణం' అను పద శబ్దం సర్వసాధారనంగా వినేమాట, అందరు ఉపయోగించే పదము. తరచూ ఈ పదాన్ని చాలా పరిమితమైన పరిధిలో, సందర్భాలలో, కుంచితమైన అర్థంతో ఉపయోగిస్తుంటారు. ప్రాణం అన్నది అతి సూక్ష్మ విషయం, పదార్ధం, అంతర్గతం కాబట్టి దానిని పట్టించుకోవడం లేదు. కాని ప్రాణం అనేది లేదని ఎవరు అనలేరు. కేవలం మరణ సమయంలో మాతరం ప్రాణం పోయింది అని అంటూ ఉంటాము. జన్మించినప్పుడు కూడా ఈ పదం వాడము. మృత్యువే దీనికి అధిపతి. మానవ శరీరాన్ని నడిపించే ఇంధన శక్తిలాంటి ఈ ప్రాణం ఎలాంటిదో ఈ పుస్తకం వలన గ్రహించవచ్చు. శరీర ఉపాధి, అంతర ప్రవృత్తికి సంబంధించిన నిగూఢ విషయాలు మాత్రము ప్రతి ఒక్కరికి కొత్తయే. ఈ ప్రాణ రహస్యములను, అద్భుత ప్రక్రియలను బహిర్గతం చేయడానికే ఈ చిన్న ప్రయత్నం. - యోగశ్రీ© 2017,www.logili.com All Rights Reserved.