ప్రతి మనిషిలో బ్రహ్మతత్వం గర్భితంగా ఉంది. బాహ్యదృశ్య ప్రపంచమునంత నిరోధించి అంతర్ముఖమై దృష్టి కోణములతో ఈ దివ్యత్వాన్ని అనుభూతి పొందడమే జీవిత పరమావధి. దీనికి రూపొందించబడినదే ఈ ధ్యానయోగం. ధ్యానయోగ సారాంశము ఇదియు! జీవితానికంతా ఇదే మూలం. వాదాలు, తర్కాలు, ఆస్థి, నాస్థి, కర్మలు, కార్యకలాపాలు, తీర్థాలు, క్షేత్రాలు, గ్రంథాలు, దేవాలయాలు ఇవన్నియు వ్యర్థహులు, అనర్థఖము.
ఈ పుస్తకమును చదివిన ఒక గొప్ప శక్తి ధ్యానావస్థలో అనుభూతి పొందవచ్చునను నిజం వ్యర్థమవుతుంది. పరమార్థ సాధనాలలో ఒకటైన వ్రతము "ధ్యానము - సమాధి" కాబట్టి ధ్యాన సూత్రాలను ప్రత్యేక పుస్తకంగా ప్రచురిస్తున్నాను. స్వేచ్చా వ్యాఖ్యానంతో కూడిన ధారాళమైన రచన. అనాదిగా భారతదేశం ధ్యానభూమి. ధ్యానులకు పుట్టినిల్లు.
అనేకమంది ధ్యానులకు, యోగులకు జన్మనిచ్చిన భూమి. ఇట్టి పవిత్ర భరత ఖండమున ఎంతోమంది పునీతులయ్యారు. వారి సాధనల ఫలంచే ఈనాడు ప్రపంచ దేశాలలో ఆధ్యాత్మిక యోగ రంగమున ఉన్నతమైన పవిత్ర స్థానమును పొందినది. ధ్యానము అన్న శబ్దము అతి పురాతనమైనది. ఇట్టి అభ్యాసం గురించి వేదములు, ఉపనిషత్తులు, గీత, శ్రీయోగ వాసిష్టము, పతంజలి యోగ సూత్రాలు, పురాణాలు, ఇతిహాసాలు దీని ఔన్నత్యమును గురించి చెప్పియున్నాయి.
ప్రతి మనిషిలో బ్రహ్మతత్వం గర్భితంగా ఉంది. బాహ్యదృశ్య ప్రపంచమునంత నిరోధించి అంతర్ముఖమై దృష్టి కోణములతో ఈ దివ్యత్వాన్ని అనుభూతి పొందడమే జీవిత పరమావధి. దీనికి రూపొందించబడినదే ఈ ధ్యానయోగం. ధ్యానయోగ సారాంశము ఇదియు! జీవితానికంతా ఇదే మూలం. వాదాలు, తర్కాలు, ఆస్థి, నాస్థి, కర్మలు, కార్యకలాపాలు, తీర్థాలు, క్షేత్రాలు, గ్రంథాలు, దేవాలయాలు ఇవన్నియు వ్యర్థహులు, అనర్థఖము. ఈ పుస్తకమును చదివిన ఒక గొప్ప శక్తి ధ్యానావస్థలో అనుభూతి పొందవచ్చునను నిజం వ్యర్థమవుతుంది. పరమార్థ సాధనాలలో ఒకటైన వ్రతము "ధ్యానము - సమాధి" కాబట్టి ధ్యాన సూత్రాలను ప్రత్యేక పుస్తకంగా ప్రచురిస్తున్నాను. స్వేచ్చా వ్యాఖ్యానంతో కూడిన ధారాళమైన రచన. అనాదిగా భారతదేశం ధ్యానభూమి. ధ్యానులకు పుట్టినిల్లు. అనేకమంది ధ్యానులకు, యోగులకు జన్మనిచ్చిన భూమి. ఇట్టి పవిత్ర భరత ఖండమున ఎంతోమంది పునీతులయ్యారు. వారి సాధనల ఫలంచే ఈనాడు ప్రపంచ దేశాలలో ఆధ్యాత్మిక యోగ రంగమున ఉన్నతమైన పవిత్ర స్థానమును పొందినది. ధ్యానము అన్న శబ్దము అతి పురాతనమైనది. ఇట్టి అభ్యాసం గురించి వేదములు, ఉపనిషత్తులు, గీత, శ్రీయోగ వాసిష్టము, పతంజలి యోగ సూత్రాలు, పురాణాలు, ఇతిహాసాలు దీని ఔన్నత్యమును గురించి చెప్పియున్నాయి.© 2017,www.logili.com All Rights Reserved.