సూర్య నమస్కారాలు పుస్తకం ఎప్పటి నుంచో వేద్దాం అనుకున్న మాట. ఈ మధ్య అంతర్జాతీయ యోగ దినోత్సవం పేరున జరుగుతున్న హంగామా తర్వాత ఓసారి సూర్య నమస్కారాల గురించి రాద్దాం అనిపించింది. సూర్య నమస్కారాలకి మతం రంగు పూయడం ఒక ఎత్తైతే.. ఏదోలా అందర్నీ ఒప్పిద్దాం అని సూర్య నమస్కారాలని యోగ సాధనలోంచి తొలగించడం ఇంకో ఎత్తు. సూర్యుడు దేవుడా కాదా అనేది అప్రస్తుతం. సూర్యుడు ఎదురుగా కనిపిస్తున్న సాక్షి.. జీవకోటికి ప్రత్యక్ష ఆధారం. ఆయనకి ఒక వ్యాయామం పేరుతో చేసే కృతజ్ఞత ఈ సూర్య నమస్కారాలు. ఏ పేరుతో చేసినా వ్యాయామం ఫలితాలు చాలా ఉత్తమమైనవి. సూర్య నమస్కారాలు అన్నిటికంటే ఉత్తమమైనవని పరిశోధనలు చెబుతున్న మాట.
ఈ పుస్తకంలో నాకు చాలామంది నాకు చాలామంది సహకరించారు. ముఖ్యంగా ఫోటోసెషన్ కి వారికి సమయాన్ని వెచ్చించి ఎంతో ఉత్సాహంతో పనిచేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా పింకీ కౌర్, జస్మిట్ కంథారీ, కాజల్, లక్ష్మిరావు, మూర్తిగారు, నారాయణరావుగారు, మౌనిక, శిరీష, అక్షిత, ట్వింకిల్.. యోగ వృత్తిలో కొనసాగడానికి అన్ని విధాలా నాకు సహాయపడిన డా రమేష్ గారికి ఎప్పటికీ ఋణపది ఉంటాను. దీనిని మరింత ముందుకు తీసుకు వెళ్ళడానికి మీలాంటి వారి ప్రోత్సాహం కూడా ఎంతైనా అవసరం.
- డా మాణిక్యేశ్వర రావు
సూర్య నమస్కారాలు పుస్తకం ఎప్పటి నుంచో వేద్దాం అనుకున్న మాట. ఈ మధ్య అంతర్జాతీయ యోగ దినోత్సవం పేరున జరుగుతున్న హంగామా తర్వాత ఓసారి సూర్య నమస్కారాల గురించి రాద్దాం అనిపించింది. సూర్య నమస్కారాలకి మతం రంగు పూయడం ఒక ఎత్తైతే.. ఏదోలా అందర్నీ ఒప్పిద్దాం అని సూర్య నమస్కారాలని యోగ సాధనలోంచి తొలగించడం ఇంకో ఎత్తు. సూర్యుడు దేవుడా కాదా అనేది అప్రస్తుతం. సూర్యుడు ఎదురుగా కనిపిస్తున్న సాక్షి.. జీవకోటికి ప్రత్యక్ష ఆధారం. ఆయనకి ఒక వ్యాయామం పేరుతో చేసే కృతజ్ఞత ఈ సూర్య నమస్కారాలు. ఏ పేరుతో చేసినా వ్యాయామం ఫలితాలు చాలా ఉత్తమమైనవి. సూర్య నమస్కారాలు అన్నిటికంటే ఉత్తమమైనవని పరిశోధనలు చెబుతున్న మాట. ఈ పుస్తకంలో నాకు చాలామంది నాకు చాలామంది సహకరించారు. ముఖ్యంగా ఫోటోసెషన్ కి వారికి సమయాన్ని వెచ్చించి ఎంతో ఉత్సాహంతో పనిచేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా పింకీ కౌర్, జస్మిట్ కంథారీ, కాజల్, లక్ష్మిరావు, మూర్తిగారు, నారాయణరావుగారు, మౌనిక, శిరీష, అక్షిత, ట్వింకిల్.. యోగ వృత్తిలో కొనసాగడానికి అన్ని విధాలా నాకు సహాయపడిన డా రమేష్ గారికి ఎప్పటికీ ఋణపది ఉంటాను. దీనిని మరింత ముందుకు తీసుకు వెళ్ళడానికి మీలాంటి వారి ప్రోత్సాహం కూడా ఎంతైనా అవసరం. - డా మాణిక్యేశ్వర రావు© 2017,www.logili.com All Rights Reserved.