సూర్య సిద్ధాంతము
పీఠిక
ఖగోళశాస్త్రమునకు ప్రాచీన భారతదేశము యొక్క పరిశోధనలు పునాదులు వేసాయని అంటే అతిశయోక్తి లేదు. ప్రపంచానికి మొట్టమొదటిగా ఈ జ్ఞానమును బోధించి విస్తరింపజేసిన దేశము భారత దేశము. వేదకాలమప్పటికే ఖగోళశాస్త్రము పూర్తిగా వృద్ధిచెంది ఆరు వేదాంగములలో ఒకటిగా భాసిల్లింది. కాని దురదృష్టవశాత్తు ఒక్క వేదాంగ జ్యోతిషము తప్ప, అప్పటి ఖగోళశాస్త్ర విజ్ఞానము మన తరములవరకు చేరకుండ కాలగర్భంలో కలసిపోయింది. వేదాంగ జ్యోతిషమునందు మనకు లభ్యమైన కొద్దిపాటి శ్లోకములందు అప్పటి కొన్ని జ్ఞానతునకలు మాత్రమే దొరికాయి. కాని ప్రాచీన పురాణములలో అక్కడక్కడ జ్యోతిష శాస్త్రము గురించి చేసిన వర్ణనలు, సంస్కృత వాజ్ఞ్మయములోను, పురాణములలోను అంతకుముందుయున్న ప్రత్యయములు, ఉదాహరణలు జ్యోతిష శాస్త్రము యొక్క అతిపురాతన జ్ఞానము గూర్చి తెలియజేస్తాయి.
వరాహమిహురిని పంచసిద్దాంతికలో వివరించిన వాశిష్ట, పైతామహ సిద్ధాంతములు పురాతనమైనవి. ఇందు సంవత్సరముల యుగములలో 60 సౌర మాసములు, 62 చాంద్రమాసములు వర్ణించబడ్డాయి. యుగాది ధనిష్ణా నక్షత్రముతోను, అహర్గణములు సూర్యోదయముతోను గణించబడ్డాయి. అతి దీర్ఘదినము 18 ముహూర్తములతోను, అతిచిన్న దినము | 12 ముహూర్తములతోను, దినపరిమాణములో హెచ్చుతగ్గులు సమానముగా అగునని వివరించారు. పైతామహ సిద్ధాంతము పురాతన వేదాంగద్యోతిషము, గర్గ సంహితలకు, జైనుల సూర్యప్రజ్ఞప్తి గ్రందమునకు దగ్గరగా ఉన్నది. వాశిష్ట సిద్ధాంతములో (వరాహమిహిరుని వివరణ) 5 వర్షముల యుగముతో శంకుదాయ, లగ్నము, రాశిచక్రము కూడ వివరించబడ్డాయి. సుధాకాంత భరద్వాజ |
రోమక సిద్ధాంతములో యవనపురము (ఇప్పటి అలెక్జాండ్రియా) యొక్క రేఖాంశతో భూమధ్యరేఖను తీసుకొని అహర్గణములు సాధించబడ్డాయి. ఇందు సౌర చాంద్ర మాసములతో కూడిన 2850 సంవత్సరములు ఒక యుగము. ఈవిధముగా రోమక సిద్ధాంతము సూర్య సిద్ధాంతమునకు విభిన్నమైనది. పౌలిష సిద్ధాంతమునందు వర్ణించిన అహర్గణములు యవనపుర ఆధారితమైనవి. ఇందు యవనపురి రేఖాంశతో బాటు ఉజ్జయిని, వారణాసిల రేఖాంశలు వాటి వ్యత్యాసములు చర్చించారు. కాని పౌలిష సిద్దాంత విషయములు టాలమీ మరియు ఇతర గ్రీకు సిద్ధాంతములకన్న సూర్యసిద్దాంతముతో ఎక్కువ పొందిక ఉన్నట్లు అనిపిస్తుంది.
సూర్యసిద్ధాంతములో యుగములు దాల దీర్ఘమైనవి. యుగముల ఆది అశ్వినియొక్క ఆదిబిందువు నుండి పరిగణించారు. అహరణములు అర్ధరాత్రి నుండి లెక్కించి దినపరిమాణముల........
సూర్య సిద్ధాంతము పీఠిక ఖగోళశాస్త్రమునకు ప్రాచీన భారతదేశము యొక్క పరిశోధనలు పునాదులు వేసాయని అంటే అతిశయోక్తి లేదు. ప్రపంచానికి మొట్టమొదటిగా ఈ జ్ఞానమును బోధించి విస్తరింపజేసిన దేశము భారత దేశము. వేదకాలమప్పటికే ఖగోళశాస్త్రము పూర్తిగా వృద్ధిచెంది ఆరు వేదాంగములలో ఒకటిగా భాసిల్లింది. కాని దురదృష్టవశాత్తు ఒక్క వేదాంగ జ్యోతిషము తప్ప, అప్పటి ఖగోళశాస్త్ర విజ్ఞానము మన తరములవరకు చేరకుండ కాలగర్భంలో కలసిపోయింది. వేదాంగ జ్యోతిషమునందు మనకు లభ్యమైన కొద్దిపాటి శ్లోకములందు అప్పటి కొన్ని జ్ఞానతునకలు మాత్రమే దొరికాయి. కాని ప్రాచీన పురాణములలో అక్కడక్కడ జ్యోతిష శాస్త్రము గురించి చేసిన వర్ణనలు, సంస్కృత వాజ్ఞ్మయములోను, పురాణములలోను అంతకుముందుయున్న ప్రత్యయములు, ఉదాహరణలు జ్యోతిష శాస్త్రము యొక్క అతిపురాతన జ్ఞానము గూర్చి తెలియజేస్తాయి. వరాహమిహురిని పంచసిద్దాంతికలో వివరించిన వాశిష్ట, పైతామహ సిద్ధాంతములు పురాతనమైనవి. ఇందు సంవత్సరముల యుగములలో 60 సౌర మాసములు, 62 చాంద్రమాసములు వర్ణించబడ్డాయి. యుగాది ధనిష్ణా నక్షత్రముతోను, అహర్గణములు సూర్యోదయముతోను గణించబడ్డాయి. అతి దీర్ఘదినము 18 ముహూర్తములతోను, అతిచిన్న దినము | 12 ముహూర్తములతోను, దినపరిమాణములో హెచ్చుతగ్గులు సమానముగా అగునని వివరించారు. పైతామహ సిద్ధాంతము పురాతన వేదాంగద్యోతిషము, గర్గ సంహితలకు, జైనుల సూర్యప్రజ్ఞప్తి గ్రందమునకు దగ్గరగా ఉన్నది. వాశిష్ట సిద్ధాంతములో (వరాహమిహిరుని వివరణ) 5 వర్షముల యుగముతో శంకుదాయ, లగ్నము, రాశిచక్రము కూడ వివరించబడ్డాయి. సుధాకాంత భరద్వాజ | రోమక సిద్ధాంతములో యవనపురము (ఇప్పటి అలెక్జాండ్రియా) యొక్క రేఖాంశతో భూమధ్యరేఖను తీసుకొని అహర్గణములు సాధించబడ్డాయి. ఇందు సౌర చాంద్ర మాసములతో కూడిన 2850 సంవత్సరములు ఒక యుగము. ఈవిధముగా రోమక సిద్ధాంతము సూర్య సిద్ధాంతమునకు విభిన్నమైనది. పౌలిష సిద్ధాంతమునందు వర్ణించిన అహర్గణములు యవనపుర ఆధారితమైనవి. ఇందు యవనపురి రేఖాంశతో బాటు ఉజ్జయిని, వారణాసిల రేఖాంశలు వాటి వ్యత్యాసములు చర్చించారు. కాని పౌలిష సిద్దాంత విషయములు టాలమీ మరియు ఇతర గ్రీకు సిద్ధాంతములకన్న సూర్యసిద్దాంతముతో ఎక్కువ పొందిక ఉన్నట్లు అనిపిస్తుంది. సూర్యసిద్ధాంతములో యుగములు దాల దీర్ఘమైనవి. యుగముల ఆది అశ్వినియొక్క ఆదిబిందువు నుండి పరిగణించారు. అహరణములు అర్ధరాత్రి నుండి లెక్కించి దినపరిమాణముల........© 2017,www.logili.com All Rights Reserved.