శ్రీ శివానంద సద్గురు వరేణ్యులు సనాతన ధర్మ ప్రచార బద్ధ కంకణులు. వేద పురాణేతిహాస ప్రతిపాదిక ధర్మమే సనాతన ధర్మము. అట్టి ధర్మమును తాము ఆచరించుటయే కాక ఇతరులచే నాచరింప జేసిన ఆచార్యవర్యులు. తదనుగుణముగా ఆయా సందర్భముల యందు భక్తులకు ధర్మప్రబోధము గావించుటకుగాను ప్రవచనములు గావించిన దేశికేంద్రులు. ఆ ప్రవచన పరంపరలోనివే కఠయోగము, శివయోగప్రదీపికపై ప్రవచనములు.
మానవ ప్రధాన లక్ష్యము ధర్మాచరణతో పాటుగా మోక్ష సంపాదనమే. అందుకు చెప్పబడిన మార్గములలో "త్రయీ సాంఖ్యం యోగః పశుపతి మతం" యోగమార్గము ప్రధానమైనది. గురువనుగ్రహములేనిదే ఆ మార్గములు సుఖరములుకావు. - డా. కె. శివానందమూర్తి