మనిషి ధైర్యం, సాహసం ఊపిరులుగా జీవించాలి. మన బ్రతుకు మనది కావచ్చు. కాని మన జీవితం పదుగురికి కొన్ని అయినా జీవిత సత్యాలను అందించగలిగితే, జీవించినందుకు కొంత ప్రయోజనం ఉంటుంది. ఏ మనిషీ ఆశించినవన్నీ తన జీవిత కాలంలో సాధించలేడు. అందుకు మహాత్ముల జీవితాలు, వారి ఆశయాలే నిదర్శనాలు. ఆశించినవన్నీ స్వప్నాలుగా కరిగిపోకుండా, కొన్ని కలలైనా నిజాలు చేసుకోగలిగితే జీవితానికి సాఫల్యం ఉంటుంది. జీవితగమ్యం ఒకటి నిర్దేశించుకున్న వారి తపన వేరు, తపస్సు వేరు. గమ్యం లేకపోతే నిరాశలు ఎదురవుతాయి. నిస్పృహ కలుగుతుంది. ప్రతి ఓటమి అపజయం కాదు. ప్రతి అపజయం గెలుపుకు ఒక సోపానం. ప్రతి గెలుపు ప్రగతికి ఒక సంకేతం. ఎవరికైనా నైరాశ్యం చిరకాలం ఉండదు. ఆశ తొంగి చూస్తుంది. ఒక ఆశ మరో ఆశకు, జీవితాసహాయానికి ఆధారమవుతుంది.
మనిషి ధైర్యం, సాహసం ఊపిరులుగా జీవించాలి. మన బ్రతుకు మనది కావచ్చు. కాని మన జీవితం పదుగురికి కొన్ని అయినా జీవిత సత్యాలను అందించగలిగితే, జీవించినందుకు కొంత ప్రయోజనం ఉంటుంది. ఏ మనిషీ ఆశించినవన్నీ తన జీవిత కాలంలో సాధించలేడు. అందుకు మహాత్ముల జీవితాలు, వారి ఆశయాలే నిదర్శనాలు. ఆశించినవన్నీ స్వప్నాలుగా కరిగిపోకుండా, కొన్ని కలలైనా నిజాలు చేసుకోగలిగితే జీవితానికి సాఫల్యం ఉంటుంది. జీవితగమ్యం ఒకటి నిర్దేశించుకున్న వారి తపన వేరు, తపస్సు వేరు. గమ్యం లేకపోతే నిరాశలు ఎదురవుతాయి. నిస్పృహ కలుగుతుంది. ప్రతి ఓటమి అపజయం కాదు. ప్రతి అపజయం గెలుపుకు ఒక సోపానం. ప్రతి గెలుపు ప్రగతికి ఒక సంకేతం. ఎవరికైనా నైరాశ్యం చిరకాలం ఉండదు. ఆశ తొంగి చూస్తుంది. ఒక ఆశ మరో ఆశకు, జీవితాసహాయానికి ఆధారమవుతుంది.© 2017,www.logili.com All Rights Reserved.