తెలుగు సాహిత్యంలో చిరకాలంగా ఒక విశేషస్థానం కలిగివున్న రాయలసీమలో అనంతపురంజిల్లా తనదైన ప్రత్యేకతను సంతరించుకున్నట్టి సాహిత్యసీమ. ప్రకృతిరీత్యా తీవ్రకరువు ప్రాంతమైనా, ప్రవృత్తిరీత్యా తెలుగుసాహిత్యంలో మనం గమనించే అన్నిప్రక్రియలూ అనంతపురం జిల్లాసాహిత్యంలో ఇక్కడి రచయితల కలాలనుండి దశాబ్దాల తరబడి ఎన్నో రచనలుగా వెలువడినాయి. ఈ నేపథ్యంలో ఆధునికకవితాధోరణుల్లో మనకు అగుపడే చాలా ప్రక్రియలు సైతం అనంతసాహితీసీమలో వెలుగులోనికి వచ్చినాయి.
వీటిలో నూతనప్రక్రియలైన మినీకవితలు, హైకూలు, నానీలు, గాధలు, రెక్కలు, లిప్రాలు, వ్యంజకాలు, వంటివి సైతం ఈ జిల్లాలోని రచయితల దృష్టిని దాటిపోలేదు. వాటిలో 'నానీలు' ఒకటి. నానీల నిర్మాణంలో రెండు భాగాలు వుంటాయి. మొదటిభాగం ఒక అంశాన్ని ప్రతిపాదిస్తుంది. రెండవభాగం దానిపై గల వ్యాఖ్య. ఈ రెండింటిలో నానీల ప్రాణం రెండవభాగం. ఎందుకంటే కవి సామర్థ్యం అక్కడే అగుపడుతుంది. ఏది ఏమైనా పాఠకుడు నానీలను హాయిగా స్పందించవచ్చు.
తెలుగు సాహిత్యంలో చిరకాలంగా ఒక విశేషస్థానం కలిగివున్న రాయలసీమలో అనంతపురంజిల్లా తనదైన ప్రత్యేకతను సంతరించుకున్నట్టి సాహిత్యసీమ. ప్రకృతిరీత్యా తీవ్రకరువు ప్రాంతమైనా, ప్రవృత్తిరీత్యా తెలుగుసాహిత్యంలో మనం గమనించే అన్నిప్రక్రియలూ అనంతపురం జిల్లాసాహిత్యంలో ఇక్కడి రచయితల కలాలనుండి దశాబ్దాల తరబడి ఎన్నో రచనలుగా వెలువడినాయి. ఈ నేపథ్యంలో ఆధునికకవితాధోరణుల్లో మనకు అగుపడే చాలా ప్రక్రియలు సైతం అనంతసాహితీసీమలో వెలుగులోనికి వచ్చినాయి. వీటిలో నూతనప్రక్రియలైన మినీకవితలు, హైకూలు, నానీలు, గాధలు, రెక్కలు, లిప్రాలు, వ్యంజకాలు, వంటివి సైతం ఈ జిల్లాలోని రచయితల దృష్టిని దాటిపోలేదు. వాటిలో 'నానీలు' ఒకటి. నానీల నిర్మాణంలో రెండు భాగాలు వుంటాయి. మొదటిభాగం ఒక అంశాన్ని ప్రతిపాదిస్తుంది. రెండవభాగం దానిపై గల వ్యాఖ్య. ఈ రెండింటిలో నానీల ప్రాణం రెండవభాగం. ఎందుకంటే కవి సామర్థ్యం అక్కడే అగుపడుతుంది. ఏది ఏమైనా పాఠకుడు నానీలను హాయిగా స్పందించవచ్చు.© 2017,www.logili.com All Rights Reserved.