ఈ పుస్తకాన్ని వెలకు మించి ఆస్వాదించడానికి ఓ చిట్కా చెబుతాను. అదేంటంటే ముందు సంకోచించక తెగించి ఈ పుస్తకాన్ని కొనండి. చూసి చూడగానే, "ఇంత తగలేసి తెచ్చారా?" అని ఇంటావిడ కళ్ళెర్ర చేస్తే - "లేదే బాబూ, కింగ్ కోటి పేవ్ మెంట్ మీద గుట్టలుపోసి అమ్ముతున్నారు... పావలా.." అని చెప్పి ధైర్యంగా నమ్మించండి. నవ్వించండి. ఇంట్లో మీకున్న 'గుడ్ విల్' పై ఆధారపడి నమ్మడం, నమ్మకపోవడం ఉంటుంది. ఇంతకీ అసలు చిట్కా ఏంటంటే - ముందస్తుగా ఈ పుస్తకం సరి సంఖ్య పేజీలను పలకరించండి. హాయిగానో, ఆహాయిగానో నవ్వుకోండి. తరువాత బేసి సంఖ్య పేజీలను తిలకించండి. బేషుగ్గా నవ్వుకోండి. అదేమంటే, వత్తిడి లేకుండా కేజ్రీవాల్ జపించిన మంత్రమని చెప్పండి. సరి సంఖ్య వేళ నవ్వు ప్రాక్టీస్ అవుతుందేమో, బేసిలో నవ్వు తెరలు తెరలుగా ఆవిష్కృతమవుతుంది.
ఇక్కడ బరువైన శబ్దం పడింది - అమ్మవారి కటాక్షం! మీరు ఆస్వాదించి, ఆనందిస్తున్నంతసేపూ ఆవిడగారు గుటకలేస్తూ, నవ్వలేక మింగలేక కక్కలేక చూస్తుంటారు. ఆవిడకిచ్చి ముందు బేసి, ఆనక సరి చూడమని సూచించండి. ఊరికే గొప్పకిపోయి ఆజ్ఞాపించకండి. కథ అడ్డం తిరుగుతుంది. సాయంత్రం దాకా ఆవిడకీ అదే నవ్వు, అదే అనుభవం, అచ్చమైన తెలుగు ఆవడ తిన్న అనుభూతి. తృప్తిగా బ్రేవ్ మని త్రేన్చి, "చూశావుటోయ్! పావలాతో ఎంత ఫన్ తెచ్చానో..." అని గర్వంగా కొంచెం సిగ్గుపడుతూ నిర్భయంగా ప్రకటించకండి. అటునుంచి ఓ గాఢ నిట్టూర్పు తర్వాత - "పోనీ ఇంకోటి కూడా పట్రాకపోయారా... తెలుసుగా మా తమ్ముడికి బొమ్మల బుక్కులంటే చచ్చే ఇష్టం... వాడికోటి అచ్చంగా ఇచ్చేదాన్ని కదా... ఏవిటో అంతా నా ఖర్మ..." దగ్గర ఈ కార్టూన్ కథ కొత్త ట్విస్ట్ తీసుకుంటుంది. దానికీ సిద్ధపడి ఉండండి.
- శ్రీరమణ
ఈ పుస్తకాన్ని వెలకు మించి ఆస్వాదించడానికి ఓ చిట్కా చెబుతాను. అదేంటంటే ముందు సంకోచించక తెగించి ఈ పుస్తకాన్ని కొనండి. చూసి చూడగానే, "ఇంత తగలేసి తెచ్చారా?" అని ఇంటావిడ కళ్ళెర్ర చేస్తే - "లేదే బాబూ, కింగ్ కోటి పేవ్ మెంట్ మీద గుట్టలుపోసి అమ్ముతున్నారు... పావలా.." అని చెప్పి ధైర్యంగా నమ్మించండి. నవ్వించండి. ఇంట్లో మీకున్న 'గుడ్ విల్' పై ఆధారపడి నమ్మడం, నమ్మకపోవడం ఉంటుంది. ఇంతకీ అసలు చిట్కా ఏంటంటే - ముందస్తుగా ఈ పుస్తకం సరి సంఖ్య పేజీలను పలకరించండి. హాయిగానో, ఆహాయిగానో నవ్వుకోండి. తరువాత బేసి సంఖ్య పేజీలను తిలకించండి. బేషుగ్గా నవ్వుకోండి. అదేమంటే, వత్తిడి లేకుండా కేజ్రీవాల్ జపించిన మంత్రమని చెప్పండి. సరి సంఖ్య వేళ నవ్వు ప్రాక్టీస్ అవుతుందేమో, బేసిలో నవ్వు తెరలు తెరలుగా ఆవిష్కృతమవుతుంది. ఇక్కడ బరువైన శబ్దం పడింది - అమ్మవారి కటాక్షం! మీరు ఆస్వాదించి, ఆనందిస్తున్నంతసేపూ ఆవిడగారు గుటకలేస్తూ, నవ్వలేక మింగలేక కక్కలేక చూస్తుంటారు. ఆవిడకిచ్చి ముందు బేసి, ఆనక సరి చూడమని సూచించండి. ఊరికే గొప్పకిపోయి ఆజ్ఞాపించకండి. కథ అడ్డం తిరుగుతుంది. సాయంత్రం దాకా ఆవిడకీ అదే నవ్వు, అదే అనుభవం, అచ్చమైన తెలుగు ఆవడ తిన్న అనుభూతి. తృప్తిగా బ్రేవ్ మని త్రేన్చి, "చూశావుటోయ్! పావలాతో ఎంత ఫన్ తెచ్చానో..." అని గర్వంగా కొంచెం సిగ్గుపడుతూ నిర్భయంగా ప్రకటించకండి. అటునుంచి ఓ గాఢ నిట్టూర్పు తర్వాత - "పోనీ ఇంకోటి కూడా పట్రాకపోయారా... తెలుసుగా మా తమ్ముడికి బొమ్మల బుక్కులంటే చచ్చే ఇష్టం... వాడికోటి అచ్చంగా ఇచ్చేదాన్ని కదా... ఏవిటో అంతా నా ఖర్మ..." దగ్గర ఈ కార్టూన్ కథ కొత్త ట్విస్ట్ తీసుకుంటుంది. దానికీ సిద్ధపడి ఉండండి. - శ్రీరమణ© 2017,www.logili.com All Rights Reserved.