బడుగువర్గాల జీవితాలు బాగుపడడాన్ని మనం ఇంకా 'అభివృద్ధి'గా అర్థం చేసుకోవడం లేదు. సంక్షేమంగా మాత్రమే అర్థం చేసుకుంటున్నాం. 'సంక్షేమం' అనేది ఎంత 'అభివృద్దో' గ్రహించినట్టయితే ఈ విషయాల గురించి మనం చర్చించే పద్ధతే మారిపోతుంది. ప్రభుత్వ ఖజానాకూ ప్రవేట్ బ్యాంక్ అకౌంట్లకూ పెట్టుబడులను వేగంగా జమచేసేది మాత్రమే అభివృద్ధి కాదనీ, ప్రజల జీవితాలను బాగుపరిచేదీ అభివృద్దే అని గ్రహించే రోజు ఎప్పుడొస్తుందో.
బలహీనవర్గాలకు స్కాలర్ షిప్ లు, చవకబియ్యము, కరెంటు సబ్సిడీలు, ఉచిత వైద్యం, విద్య - ఇవన్నీ యాభైఏళ్ళుగా లేకుండినట్టయితే ఈ రోజు పక్కా ఇళ్ళలో ఉంటూ పిల్లలను అంతో ఇంతో చదివించుకుంటూ ఒక మోస్తరు జీవన ప్రమాణం అనుభవిస్తున్న లక్షలాది కుటుంబాలు ఎక్కడుండేవి, ఏ విధంగా ఉండేవి? ఇది 'అభివృద్ధి' కాదనీ ప్రభుత్వానికి ఆర్ధిక భారం పెంచే సంక్షేమ వ్యయం మాత్రమేననీ అనుకోగలమా? ఈ ప్రశ్నలన్నిటి సమాధానం కావాలంటే ఈ పుస్తకం చదవక తప్పదు.
బడుగువర్గాల జీవితాలు బాగుపడడాన్ని మనం ఇంకా 'అభివృద్ధి'గా అర్థం చేసుకోవడం లేదు. సంక్షేమంగా మాత్రమే అర్థం చేసుకుంటున్నాం. 'సంక్షేమం' అనేది ఎంత 'అభివృద్దో' గ్రహించినట్టయితే ఈ విషయాల గురించి మనం చర్చించే పద్ధతే మారిపోతుంది. ప్రభుత్వ ఖజానాకూ ప్రవేట్ బ్యాంక్ అకౌంట్లకూ పెట్టుబడులను వేగంగా జమచేసేది మాత్రమే అభివృద్ధి కాదనీ, ప్రజల జీవితాలను బాగుపరిచేదీ అభివృద్దే అని గ్రహించే రోజు ఎప్పుడొస్తుందో. బలహీనవర్గాలకు స్కాలర్ షిప్ లు, చవకబియ్యము, కరెంటు సబ్సిడీలు, ఉచిత వైద్యం, విద్య - ఇవన్నీ యాభైఏళ్ళుగా లేకుండినట్టయితే ఈ రోజు పక్కా ఇళ్ళలో ఉంటూ పిల్లలను అంతో ఇంతో చదివించుకుంటూ ఒక మోస్తరు జీవన ప్రమాణం అనుభవిస్తున్న లక్షలాది కుటుంబాలు ఎక్కడుండేవి, ఏ విధంగా ఉండేవి? ఇది 'అభివృద్ధి' కాదనీ ప్రభుత్వానికి ఆర్ధిక భారం పెంచే సంక్షేమ వ్యయం మాత్రమేననీ అనుకోగలమా? ఈ ప్రశ్నలన్నిటి సమాధానం కావాలంటే ఈ పుస్తకం చదవక తప్పదు.© 2017,www.logili.com All Rights Reserved.