ఆ బిక్షకుని తేజస్సుకు రాజే అసూయ చెందాడు. "ఏం కావాలి?" అనడిగాడు. "ఈ బిక్షాపాత్రను నింపండి" అన్నాడు బిక్షకుడు. "దేంతో నింపమంటారు? నేను రాజును, వజ్రాలతో నింపగలను" అన్నాడు రాజు. "ఏవైనా ఫరవాలేదు, కానీ అంచులదాకా నింపడం మరువకండి." అన్నాడు బిక్షకుడు. రాజు తన ధనాగారం నుంచి వజ్రాలు తెప్పించాడు. వేసిన వజ్రాలు వేసినట్టే మాయమౌతున్నాయి. రాజు వద్ద నున్న వజ్రాలన్నీ అదృశ్యమయ్యాయి కానీ బిక్షకుని పాత్ర మాత్రం ఖాళీగానే ఉంది.
రాజు బిక్షకుని కాళ్ళపైబడి "మీరెవరో అసాధారణ పురుషులు. ఈ బిక్షాపాత్రలో ఏమి మహత్తు ఉందో తెలియడం లేదు. దీనిని దేంతో నిర్మించారో చెప్పండి" అని వేడుకున్నాడు.
"దీనిని మనిషి పుర్రెతో నిర్మించాను రాజా! అందువలననే దీనికి అసలు తృప్తి అంటూ లేదు. అన్నింటినీ దిగమ్రింగి, మరికోన్ని౦టికై ఎదురు చూస్తూ ఉంటుంది" అన్నాడు బిక్షకుడు.
మానవుని మనస్సు, మేధస్సుల గూర్చి ఇంత లోతైన చింతనగావించిన మహాపురుషుల బోధనలెన్నో.... నీలం రాజు లక్ష్మీప్రసాద్ గారి ద్వారా మనకు.
- విద్యామిత్ర ప్రచురణలు, కర్నూల్
ఆ బిక్షకుని తేజస్సుకు రాజే అసూయ చెందాడు. "ఏం కావాలి?" అనడిగాడు. "ఈ బిక్షాపాత్రను నింపండి" అన్నాడు బిక్షకుడు. "దేంతో నింపమంటారు? నేను రాజును, వజ్రాలతో నింపగలను" అన్నాడు రాజు. "ఏవైనా ఫరవాలేదు, కానీ అంచులదాకా నింపడం మరువకండి." అన్నాడు బిక్షకుడు. రాజు తన ధనాగారం నుంచి వజ్రాలు తెప్పించాడు. వేసిన వజ్రాలు వేసినట్టే మాయమౌతున్నాయి. రాజు వద్ద నున్న వజ్రాలన్నీ అదృశ్యమయ్యాయి కానీ బిక్షకుని పాత్ర మాత్రం ఖాళీగానే ఉంది. రాజు బిక్షకుని కాళ్ళపైబడి "మీరెవరో అసాధారణ పురుషులు. ఈ బిక్షాపాత్రలో ఏమి మహత్తు ఉందో తెలియడం లేదు. దీనిని దేంతో నిర్మించారో చెప్పండి" అని వేడుకున్నాడు. "దీనిని మనిషి పుర్రెతో నిర్మించాను రాజా! అందువలననే దీనికి అసలు తృప్తి అంటూ లేదు. అన్నింటినీ దిగమ్రింగి, మరికోన్ని౦టికై ఎదురు చూస్తూ ఉంటుంది" అన్నాడు బిక్షకుడు. మానవుని మనస్సు, మేధస్సుల గూర్చి ఇంత లోతైన చింతనగావించిన మహాపురుషుల బోధనలెన్నో.... నీలం రాజు లక్ష్మీప్రసాద్ గారి ద్వారా మనకు. - విద్యామిత్ర ప్రచురణలు, కర్నూల్© 2017,www.logili.com All Rights Reserved.