కార్టూన్ 'శివసేన'కు ఆది ఆట ఆట! ఈ కార్టూన్ల రాపిడికి ముందుమాటల తోపుడు అవసరం లేదు. అయినా కుంచె ముందు కలం కదులుతున్నది. మన్నించండి. తెలుగు కార్టూన్ దేవాలయంలో మూలవిరాట్ బాపుగారు. ప్రధాన అర్చకుడు జయదేవ్ గారు. తర్వాత శంకు పోసిన తీర్థం 'హాస్యప్రియ'. కార్టూన్ కళా భవనానికి శంకుస్థాపన చేశాడు. బాపురమణగార్లు శంకు మార్కు లుంగీలే కట్టుకునేవారు. ఇప్పుడు తెలుగు కార్టూన్ అంతా 'రాము' మాయం అంటున్నది హాస్యానందంగా! ఇది ఆశ్చర్యార్థకం కాదు ఆనందార్థకం. తెలుగు లలితా కళా తోరణంలో ఎమినెంట్ కార్టూనిస్టులను వెలిగించాడు శంకు. ఇంకేం చేశాడంటే ఆ డాక్యుమెంటరీ నిర్మాణంలో రాంపా - ని వెంట తిప్పాడు, గాల్లో ఎగిరించాడు. అంతకు ముందేం చేశాడంటే - మిస్టర్ పెళ్ళాం సినిమాలో బాపుగారి చేతుల్లో పడేశాడు. అంతవరకు బాగానే ఉంది. ఇదేంటండీ. ఈ లాఫ్టూన్లేంటండీ!
- రాంపా
కార్టూన్ 'శివసేన'కు ఆది ఆట ఆట! ఈ కార్టూన్ల రాపిడికి ముందుమాటల తోపుడు అవసరం లేదు. అయినా కుంచె ముందు కలం కదులుతున్నది. మన్నించండి. తెలుగు కార్టూన్ దేవాలయంలో మూలవిరాట్ బాపుగారు. ప్రధాన అర్చకుడు జయదేవ్ గారు. తర్వాత శంకు పోసిన తీర్థం 'హాస్యప్రియ'. కార్టూన్ కళా భవనానికి శంకుస్థాపన చేశాడు. బాపురమణగార్లు శంకు మార్కు లుంగీలే కట్టుకునేవారు. ఇప్పుడు తెలుగు కార్టూన్ అంతా 'రాము' మాయం అంటున్నది హాస్యానందంగా! ఇది ఆశ్చర్యార్థకం కాదు ఆనందార్థకం. తెలుగు లలితా కళా తోరణంలో ఎమినెంట్ కార్టూనిస్టులను వెలిగించాడు శంకు. ఇంకేం చేశాడంటే ఆ డాక్యుమెంటరీ నిర్మాణంలో రాంపా - ని వెంట తిప్పాడు, గాల్లో ఎగిరించాడు. అంతకు ముందేం చేశాడంటే - మిస్టర్ పెళ్ళాం సినిమాలో బాపుగారి చేతుల్లో పడేశాడు. అంతవరకు బాగానే ఉంది. ఇదేంటండీ. ఈ లాఫ్టూన్లేంటండీ! - రాంపా© 2017,www.logili.com All Rights Reserved.