మెడికల్ షాపురాణం
ఒకటంటే ఒకటిస్తాడు గాని అడిగింది మాత్రం తప్పిస్తుంటాడు
కంపనీ బట్టి పేరువేరేగాని సూత్రం ఒక్కటేనని వాదిస్తుంటాడు
కాదదే కావాలంటే ఇంకోకొట్టు నుంచైనా సరే తెప్పిస్తుంటాడు
వెంటనే నయం అయితే రోగం, వ్యాపారం ఎలా సాగిస్తానంటాడు.
పుస్త కీటకం
ఎదో ఒక పుస్తకం కరదీపకయై వుండాలంటాడు
అడుగడుగునా చదివే అలవాటుని గౌరవిస్తుంటాడు
చదివించడమే తన పనైతే ఇంకేం కావాలంటాడు
అనుభవాన్ని నలుగురికీ అందించమంటే నాకేంటంటాడు
వీటిని చదివిన తరువాత అబ్బ! ఏం రాశారు! అని ఒక్కసారైనా అనుకోని వాళ్ళకి ఎక్కడో ఎదో తేడా వున్నట్లే అని డొంక తిరుగుడు మాటలు చెప్పకుండా, ఏ డొంకా తిప్పకుండానే కదిలే కంచె - చక్కటి హాస్య వ్యంగ్య ప్రక్రియ - కొస విసుర్లు.
- అల్లాణి శ్రీధర్
మెడికల్ షాపురాణం ఒకటంటే ఒకటిస్తాడు గాని అడిగింది మాత్రం తప్పిస్తుంటాడు కంపనీ బట్టి పేరువేరేగాని సూత్రం ఒక్కటేనని వాదిస్తుంటాడు కాదదే కావాలంటే ఇంకోకొట్టు నుంచైనా సరే తెప్పిస్తుంటాడు వెంటనే నయం అయితే రోగం, వ్యాపారం ఎలా సాగిస్తానంటాడు. పుస్త కీటకం ఎదో ఒక పుస్తకం కరదీపకయై వుండాలంటాడు అడుగడుగునా చదివే అలవాటుని గౌరవిస్తుంటాడు చదివించడమే తన పనైతే ఇంకేం కావాలంటాడు అనుభవాన్ని నలుగురికీ అందించమంటే నాకేంటంటాడు వీటిని చదివిన తరువాత అబ్బ! ఏం రాశారు! అని ఒక్కసారైనా అనుకోని వాళ్ళకి ఎక్కడో ఎదో తేడా వున్నట్లే అని డొంక తిరుగుడు మాటలు చెప్పకుండా, ఏ డొంకా తిప్పకుండానే కదిలే కంచె - చక్కటి హాస్య వ్యంగ్య ప్రక్రియ - కొస విసుర్లు. - అల్లాణి శ్రీధర్© 2017,www.logili.com All Rights Reserved.