మనోరధ యాత్రలో అనుభవశేషాలు! ఆనంద ఉద్భావాలు! కవిత్వం ఏ రూపంలో ఉన్నా, మనస్సులో ఓ తీయటి స్నేహాన్ని పంచేదే, పంచుకునేదే, పంచుకోవానుకునేదే! పాదరసం లాంటి పదరసం! రవంత వినయ నియమ గీత దాటినా రవంత కూడా విలువ లేకుండా పోతుందనే కత్తి గుండెల్లో గుచ్చుకుంటుందనే భయం దుప్పట్లోంచి తొంగిచూసిన ధైర్యాధారాలు ఈ భావధారలు! అయితే, ప్రసవానంద మైకంలో జననలోపాలు పాఠకుల కంటికి తప్పితే ఇంకెవ్వరికీ కనిపించవు, అంత తేలిగ్గా! పఠనాన్యాయాలయంలో - అసంకల్పిత లోపాలు ఎప్పటికీ నేరాలుగా భావించకపోవడం, కవుల అదృష్టం అనే చెప్పాలి. ఆ అదృష్ట భాగ్యానికి ఇసుమంత కూడా మరకలేకుండా, మరకపడకుండా ఈ మనోరధ చక్రాల కదలికలు సంస్కారారాధనా గౌరవం పూజ్యనీయమై, రాయడం ఆగకుండా సాగింది.
- రాంపా
మనోరధ యాత్రలో అనుభవశేషాలు! ఆనంద ఉద్భావాలు! కవిత్వం ఏ రూపంలో ఉన్నా, మనస్సులో ఓ తీయటి స్నేహాన్ని పంచేదే, పంచుకునేదే, పంచుకోవానుకునేదే! పాదరసం లాంటి పదరసం! రవంత వినయ నియమ గీత దాటినా రవంత కూడా విలువ లేకుండా పోతుందనే కత్తి గుండెల్లో గుచ్చుకుంటుందనే భయం దుప్పట్లోంచి తొంగిచూసిన ధైర్యాధారాలు ఈ భావధారలు! అయితే, ప్రసవానంద మైకంలో జననలోపాలు పాఠకుల కంటికి తప్పితే ఇంకెవ్వరికీ కనిపించవు, అంత తేలిగ్గా! పఠనాన్యాయాలయంలో - అసంకల్పిత లోపాలు ఎప్పటికీ నేరాలుగా భావించకపోవడం, కవుల అదృష్టం అనే చెప్పాలి. ఆ అదృష్ట భాగ్యానికి ఇసుమంత కూడా మరకలేకుండా, మరకపడకుండా ఈ మనోరధ చక్రాల కదలికలు సంస్కారారాధనా గౌరవం పూజ్యనీయమై, రాయడం ఆగకుండా సాగింది. - రాంపా© 2017,www.logili.com All Rights Reserved.