ప్రతి పనికి మంచి చెడు ఆలోచించాలి అంటారు పూర్వులు. అందుకు మొట్టమొదటి సాధనము పంచాంగము. ఇట్టి పంచాంగము చూచి ఈ సమయము మంచిది. ఈ సమయము మంచిదికాదు అని నిర్ణయించుటకు ముహూర్తశాస్త్ర విజ్ఞానము అవసరము. అట్టి ముహూర్త విజ్ఞానము గూర్చి పూర్తీ వివరములను తెలుపు గ్రంథము కావున ఈ గ్రంథమునకు ముహూర్త విజ్ఞాన సర్వస్వము అని నామమిడితిని. అందులకు ఈ గ్రంథము యొక్క వివరణలు చూచినా సార్థక నామదేయమేనని అంగీకరింపక తప్పదు అని భావిస్తున్నాను.
ఈ శాస్త్రము అనువంశీకరణముగా గురుసాంప్రదాయముగా వస్తున్నది. ప్రాంతీయతను బట్టిగాని ఇంకను చేర్పులు మార్పులున్న తెలియబరచిన వారిని గురువులుగా తలంతును. ఈ చిన్న గ్రంథము స్వాతంతముగా చదువు విద్యద్ మహాజనులకు ఈ గ్రంథము యొక్క విశిష్టతను గూర్చి తెలుపనవుసరము లేదని సహృదయ ప్రమాణ అనునట్లు ఉదాసీనముగా పాఠకులకే విడిచినందులకు మన్నింపగోరుచున్నాను.
- బికుమళ్ళ నాగేశ్వరసిద్ధాంతి
ప్రతి పనికి మంచి చెడు ఆలోచించాలి అంటారు పూర్వులు. అందుకు మొట్టమొదటి సాధనము పంచాంగము. ఇట్టి పంచాంగము చూచి ఈ సమయము మంచిది. ఈ సమయము మంచిదికాదు అని నిర్ణయించుటకు ముహూర్తశాస్త్ర విజ్ఞానము అవసరము. అట్టి ముహూర్త విజ్ఞానము గూర్చి పూర్తీ వివరములను తెలుపు గ్రంథము కావున ఈ గ్రంథమునకు ముహూర్త విజ్ఞాన సర్వస్వము అని నామమిడితిని. అందులకు ఈ గ్రంథము యొక్క వివరణలు చూచినా సార్థక నామదేయమేనని అంగీకరింపక తప్పదు అని భావిస్తున్నాను. ఈ శాస్త్రము అనువంశీకరణముగా గురుసాంప్రదాయముగా వస్తున్నది. ప్రాంతీయతను బట్టిగాని ఇంకను చేర్పులు మార్పులున్న తెలియబరచిన వారిని గురువులుగా తలంతును. ఈ చిన్న గ్రంథము స్వాతంతముగా చదువు విద్యద్ మహాజనులకు ఈ గ్రంథము యొక్క విశిష్టతను గూర్చి తెలుపనవుసరము లేదని సహృదయ ప్రమాణ అనునట్లు ఉదాసీనముగా పాఠకులకే విడిచినందులకు మన్నింపగోరుచున్నాను. - బికుమళ్ళ నాగేశ్వరసిద్ధాంతి© 2017,www.logili.com All Rights Reserved.