ప్రపంచంలో అత్యంత పురాతనమైన వైద్య విజ్ఞాన శాస్త్రం ఆయుర్వేదం. తరం నుండి తరానికి ఈ శాస్త్రం కేవలం గురుశిష్య పరంపర ద్వారా కొనసాగి చివరికి అయిదు వేల సంవత్సరాల క్రితం తొలిసారిగా గ్రంథస్థం కాబడింది. ఆయుర్వేదం అనే పదం సంస్పృత భాషకి చెందినది. ఆయుః అనే పదానికి ప్రాణం అనే అర్ధం, వేదం అనే పదానికి జ్ఞానం అనే అర్ధం వస్తాయి.
అంటే ఆయుర్వేదం ప్రాణానికి చెందిన జ్ఞానం అని అర్థం చేసుకోవచ్చు. దీని ద్వారా మనిషి తన జీవిత కాలంలో ప్రాకృతిక ధర్మాల సాయంతో సుఖజీవనం ఎలా గడపవచ్చునో తెలుసుకోవచ్చు.
ఆయుర్వేదం కేవలం రోగచికిత్సా విధానం మాత్రమే కాదు. పరిపూర్ణ జీవనానికి ఆలంబనగా నిలిచే ఒక వుత్తమ మార్గం.
- డా. ఎస్. టి. ఎన్. చారి.