మందు కంపెనీల వారు ఒక ఔషధం తయారు చేయాలంటే ముడి వస్తువులు సేకరణ నుంచి యంత్ర నిర్వహణ, విద్యుత్, ప్యాకింగ్, రవాణా వగైరా ఖర్చుల వరకు ముడిపడిన అంశం. ఈ ప్రభావం అంతా కొనుగోలుదారుడిపై పడటం వల్ల ఔషధ ధరలు భారంగా వుండటం, అత్యంత ప్రామాణికంగా, నాన్యతగా ఔషధాలను తయారుచేసే కంపెనీలు చాలా తక్కువగా వుండటం, అటువంటి ఔషధాలు కూడా అన్ని చోట్ల నిరంతరం, ఎల్లవేళలా లభ్యమయ్యే పరిస్థితులు లేకపోవటం ఇత్యాది కారణాల వల్ల ఎక్కువ మంది ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకునే పరిస్థితి లేదు.
కాబట్టి ఈ దృక్పథంలో మార్పు వచ్చి వీలైనంత మేర ఔషధాలని స్వయంగా తయారుచేసుకుని ఉపయోగించుకోవటం వల్ల ఇంకా గునవత్తరం పనిచేస్తాయనటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. కావున మందు మొక్కలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుంటేనే చక్కటి ఆరోగ్యభాగ్యం పొందేందుకు మార్గం సుగమమవుతుంది. పాఠకులు ఈ పుస్తకంలోని విషయాలను ఆకళింపు చేసుకొని అవగాహన పెంపొందించుకుని తమ పరిధిని గురైరిగి ప్రమాదం లేని వివిధ రోగాలకు, అనారోగ్య సమస్యలకు చికిత్స చేసుకొని స్వస్థత పొందవచ్చు లేదా ప్రాథమిక చికిత్సగా కూడా ఉపయోగించుకోవచ్చు. అంతేగాని ఈ పుస్తకాన్ని వైద్యుల చికిత్సకు ప్రత్యామ్నాయంగా భావించరాదు.
మందు కంపెనీల వారు ఒక ఔషధం తయారు చేయాలంటే ముడి వస్తువులు సేకరణ నుంచి యంత్ర నిర్వహణ, విద్యుత్, ప్యాకింగ్, రవాణా వగైరా ఖర్చుల వరకు ముడిపడిన అంశం. ఈ ప్రభావం అంతా కొనుగోలుదారుడిపై పడటం వల్ల ఔషధ ధరలు భారంగా వుండటం, అత్యంత ప్రామాణికంగా, నాన్యతగా ఔషధాలను తయారుచేసే కంపెనీలు చాలా తక్కువగా వుండటం, అటువంటి ఔషధాలు కూడా అన్ని చోట్ల నిరంతరం, ఎల్లవేళలా లభ్యమయ్యే పరిస్థితులు లేకపోవటం ఇత్యాది కారణాల వల్ల ఎక్కువ మంది ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఈ దృక్పథంలో మార్పు వచ్చి వీలైనంత మేర ఔషధాలని స్వయంగా తయారుచేసుకుని ఉపయోగించుకోవటం వల్ల ఇంకా గునవత్తరం పనిచేస్తాయనటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. కావున మందు మొక్కలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుంటేనే చక్కటి ఆరోగ్యభాగ్యం పొందేందుకు మార్గం సుగమమవుతుంది. పాఠకులు ఈ పుస్తకంలోని విషయాలను ఆకళింపు చేసుకొని అవగాహన పెంపొందించుకుని తమ పరిధిని గురైరిగి ప్రమాదం లేని వివిధ రోగాలకు, అనారోగ్య సమస్యలకు చికిత్స చేసుకొని స్వస్థత పొందవచ్చు లేదా ప్రాథమిక చికిత్సగా కూడా ఉపయోగించుకోవచ్చు. అంతేగాని ఈ పుస్తకాన్ని వైద్యుల చికిత్సకు ప్రత్యామ్నాయంగా భావించరాదు.© 2017,www.logili.com All Rights Reserved.