భారతదేశంలో బౌద్ధవాజ్మయ పునరుద్ధరణ చేసిన రాహుల్ సాంకృత్యాయన్, ధర్మానంద కోశాంబి, భిక్షు ధమ్మరక్షితల వరుసన భదంత ఆనంద కౌసల్యాయన్ ను కూడా ప్రజలు ఎంతో గౌరవభావంతో తలచుకుంటారు. జీవితమంతా బౌద్ధధర్మ విస్తరణ కోసం శ్రమించిన భదంత ఆనంద కౌసల్యాయన్ శ్రీలంక, ఇంగ్లాండ్, బర్మా, నేపాల్ మొదలైన దేశాల్లో పర్యటించి తన ఈ యాత్రల అనుభవాల గురించి విస్తృతంగా రాశారు.
బాబా సాహెబ్ అంబేద్కర్ తన వెనక లక్షల మంచి బౌద్ధ అనుయాయులను వదిలి వెళ్ళాడు. వారందరికీ - ముఖ్యంగా మహారాష్ట్రలో - సమర్థుడైన ఒక నాయకుడు కావలసివచ్చింది. ఆ కొరత తీర్చడానికి భదంత ఆనంద కౌసల్యాయన్ నాగ పూర్ లోని 'దీక్షభూమి' లో ఉంటూ మహారాష్ట్రలోని దళిత బౌద్ధాలకు మార్గనిర్దేశం చేశారు. ఈయన పాళీ త్రిపిటకాలను, ఇతర బౌద్ధ గ్రంథాలను పరిశీలించి వాటిలోని మూల సూత్రాలను, వివరాలను సేకరించి ప్రచురించారు కూడా.
భారతదేశంలో బౌద్ధవాజ్మయ పునరుద్ధరణ చేసిన రాహుల్ సాంకృత్యాయన్, ధర్మానంద కోశాంబి, భిక్షు ధమ్మరక్షితల వరుసన భదంత ఆనంద కౌసల్యాయన్ ను కూడా ప్రజలు ఎంతో గౌరవభావంతో తలచుకుంటారు. జీవితమంతా బౌద్ధధర్మ విస్తరణ కోసం శ్రమించిన భదంత ఆనంద కౌసల్యాయన్ శ్రీలంక, ఇంగ్లాండ్, బర్మా, నేపాల్ మొదలైన దేశాల్లో పర్యటించి తన ఈ యాత్రల అనుభవాల గురించి విస్తృతంగా రాశారు. బాబా సాహెబ్ అంబేద్కర్ తన వెనక లక్షల మంచి బౌద్ధ అనుయాయులను వదిలి వెళ్ళాడు. వారందరికీ - ముఖ్యంగా మహారాష్ట్రలో - సమర్థుడైన ఒక నాయకుడు కావలసివచ్చింది. ఆ కొరత తీర్చడానికి భదంత ఆనంద కౌసల్యాయన్ నాగ పూర్ లోని 'దీక్షభూమి' లో ఉంటూ మహారాష్ట్రలోని దళిత బౌద్ధాలకు మార్గనిర్దేశం చేశారు. ఈయన పాళీ త్రిపిటకాలను, ఇతర బౌద్ధ గ్రంథాలను పరిశీలించి వాటిలోని మూల సూత్రాలను, వివరాలను సేకరించి ప్రచురించారు కూడా.
© 2017,www.logili.com All Rights Reserved.