బుద్ధుని బోధనలను అధ్యయనం చెయ్యటానికి మనకు అందుబాటులో ఉన్న సాహిత్యం స్థూలంగా మూడు రకాలు: బుద్ధుని ఉపదేశాలను యథాతథంగా అందించినవంటున్న మూల గ్రంథాలు, తర్వాత వీటి ఆధారంగా వివిధ బౌద్ధశాఖలు రూపొందించిన వ్యాఖ్యానాలు, ఆధునిక శకంలో బౌద్ధం పై వెలువడిన రచనలు. ఇటీవల బుద్ధుని జీవితం గురించీ, బోధనల గురించీ తెలుగులో వెలువడుతున్న అనేక రచనలు మూల గ్రంథాలకు, వ్యాఖ్యానాలకు, ఆధునిక బౌద్ధ రచనలకు మధ్య గల భేదాన్ని పాటించటం లేదు. ఇందువల్ల మూల గ్రంథాలకు వ్యాఖ్యానాలకు మధ్య, ఈ రెంటికీ ఆధునిక బౌద్ధ రచనలకూ మధ్య గల విభజనరేఖ మసకబారి పోతున్నది.
ఫలితంగా ఈనాడు బౌద్ధం గురించి అసంబద్ధమైన, పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు ప్రచారమౌతున్నాయి. దీనితో, అసలు బుద్ధవచనమేదో కానిదేదో గుర్తించలేక, పాఠకులు గందరగోళానికి లోనవుతున్నారు. బౌద్ధం పేరుతో ఎవరు ఏమి రాసినా, అదంతా బుద్ధుడు చెప్పిందే అనుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితి నిజమైన బుద్ధవచనాన్ని అధ్యయనం చెయ్యటానికి, అర్థం చేసుకోవటానికి తీవ్రమైన ప్రతిబంధకంగా మారింది. ఈ సమస్యను అధిగమించేటందుకు, బౌద్ధ రచయితలూ పాఠకులూ బుద్ధవచన ప్రామాణికతను అధ్యయనం చెయ్యవలసిన అవసరం ఉంటుంది. ఆ దిశగా తెలుగులో చేసిన తొలిప్రయత్నం ఈ పుస్తకం.
బుద్ధుని బోధనలను అధ్యయనం చెయ్యటానికి మనకు అందుబాటులో ఉన్న సాహిత్యం స్థూలంగా మూడు రకాలు: బుద్ధుని ఉపదేశాలను యథాతథంగా అందించినవంటున్న మూల గ్రంథాలు, తర్వాత వీటి ఆధారంగా వివిధ బౌద్ధశాఖలు రూపొందించిన వ్యాఖ్యానాలు, ఆధునిక శకంలో బౌద్ధం పై వెలువడిన రచనలు. ఇటీవల బుద్ధుని జీవితం గురించీ, బోధనల గురించీ తెలుగులో వెలువడుతున్న అనేక రచనలు మూల గ్రంథాలకు, వ్యాఖ్యానాలకు, ఆధునిక బౌద్ధ రచనలకు మధ్య గల భేదాన్ని పాటించటం లేదు. ఇందువల్ల మూల గ్రంథాలకు వ్యాఖ్యానాలకు మధ్య, ఈ రెంటికీ ఆధునిక బౌద్ధ రచనలకూ మధ్య గల విభజనరేఖ మసకబారి పోతున్నది. ఫలితంగా ఈనాడు బౌద్ధం గురించి అసంబద్ధమైన, పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు ప్రచారమౌతున్నాయి. దీనితో, అసలు బుద్ధవచనమేదో కానిదేదో గుర్తించలేక, పాఠకులు గందరగోళానికి లోనవుతున్నారు. బౌద్ధం పేరుతో ఎవరు ఏమి రాసినా, అదంతా బుద్ధుడు చెప్పిందే అనుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితి నిజమైన బుద్ధవచనాన్ని అధ్యయనం చెయ్యటానికి, అర్థం చేసుకోవటానికి తీవ్రమైన ప్రతిబంధకంగా మారింది. ఈ సమస్యను అధిగమించేటందుకు, బౌద్ధ రచయితలూ పాఠకులూ బుద్ధవచన ప్రామాణికతను అధ్యయనం చెయ్యవలసిన అవసరం ఉంటుంది. ఆ దిశగా తెలుగులో చేసిన తొలిప్రయత్నం ఈ పుస్తకం.© 2017,www.logili.com All Rights Reserved.