ఆత్మ అంటే నేను. 'నేను' ఉంటే 'నన్ను', 'నాది' ఉంటాయి. అలాగే 'నేను' ఉన్నప్పుడు 'నీవు' ఉంటుంది. 'నీవు' తో పాటు, 'నిన్ను', 'నీది' ఉంటాయి. 'నేను' 'నీవు'లు ఉన్నప్పుడు ఇద్దరూ తమకు తాము ఎవరి చుట్టూ వారు 'గిరి' గీసుకుంటారు. 'వేరుతనం' ఏర్పడుతుంది. దీనితో స్వార్థం ఆవిర్భవిస్తుంది. స్వార్థమే అన్ని అనర్థాలకు మూలం. అసలు మానవ దురవస్థకు మూలం ఇదే. ఈ దురవస్థనే బుద్ధుడు దుఃఖంగా చెప్పాడు. 'ఆత్మ' లేక పొతే 'నేను' ఉండదు, 'నేను' లేకపోతే 'స్వార్థం' ఉండదు. 'స్వార్థం' లేకపోతే దురవస్థ ఉండదు - అంటే దుఃఖం ఉండదు. ఇదే బుద్ధుని నినాదం.
ఆత్మ అంటే నేను. 'నేను' ఉంటే 'నన్ను', 'నాది' ఉంటాయి. అలాగే 'నేను' ఉన్నప్పుడు 'నీవు' ఉంటుంది. 'నీవు' తో పాటు, 'నిన్ను', 'నీది' ఉంటాయి. 'నేను' 'నీవు'లు ఉన్నప్పుడు ఇద్దరూ తమకు తాము ఎవరి చుట్టూ వారు 'గిరి' గీసుకుంటారు. 'వేరుతనం' ఏర్పడుతుంది. దీనితో స్వార్థం ఆవిర్భవిస్తుంది. స్వార్థమే అన్ని అనర్థాలకు మూలం. అసలు మానవ దురవస్థకు మూలం ఇదే. ఈ దురవస్థనే బుద్ధుడు దుఃఖంగా చెప్పాడు. 'ఆత్మ' లేక పొతే 'నేను' ఉండదు, 'నేను' లేకపోతే 'స్వార్థం' ఉండదు. 'స్వార్థం' లేకపోతే దురవస్థ ఉండదు - అంటే దుఃఖం ఉండదు. ఇదే బుద్ధుని నినాదం.© 2017,www.logili.com All Rights Reserved.