భారత చరిత్రలో బుద్ధునికి దీటైన, సాటి అయిన మరో వ్యక్తీ మనకు కానరాడు. అంతటి మహామహుడు ఈ భూఖండం అవతరించిన తరువాత నేటివరకు పుట్టలేదు అనేవారు కూడా ఉన్నారు. అందుకేనేమో హిందువులు మచ్చలేని బుద్ధునితో సరితూగే మరో మూర్తిమత్వాన్ని సృష్టించాలని, రాముణ్ణి తయారు చేశారని ఒక వాదం ఉంది. రాముణ్ణి తయారు చేశారని భావించడానికి కొన్ని ఆధారాలున్నాయి. బుద్ధుని గురువు వెస్సామిత్త. వెస్సా మిత్త అంటే విశ్వామిత్రుడు. రాముని విషయంలో విశ్వామిత్ర పాత్ర అందరికీ తెలిసిందే. ఆ వెస్సామిత్త నుంచే విశ్వామిత్ర పాత్రను సృష్టించాడు వాల్మీకి. బౌద్ధ వెస్సామిత్త రామాయణ విశ్వామిత్ర కావడం యాదృచ్చికం కాదు.
20వ శతాబ్దంలో బౌద్ధం పునరుజ్జీవం పొందింది. ప్రపంచం నేటి మారిన విలువలకు బౌద్ధం అనుగుణమైందని భావించి అంటే హేతువాదం, మానవవాదం, లౌకికవాదం, స్వేచ్చా స్వాతంత్ర్యాలు, ప్రజాస్వామ్యం లాంటి భావనలు బౌద్ధానికి దగ్గరివని భావించి, దానిని గురించి ఆసక్తితో తెలుసుకొంటోంది. బౌద్ధేతివృత్తాలతో సృజనాత్మక రచనలే కాక, బౌద్ధ దార్శనిక సాహిత్యం కూడ వివిధ భాషలలో వెలువడుతోంది. ఆ పరంపరలోదే 'మానవీయ బుద్ధ' కూడా.
భారత చరిత్రలో బుద్ధునికి దీటైన, సాటి అయిన మరో వ్యక్తీ మనకు కానరాడు. అంతటి మహామహుడు ఈ భూఖండం అవతరించిన తరువాత నేటివరకు పుట్టలేదు అనేవారు కూడా ఉన్నారు. అందుకేనేమో హిందువులు మచ్చలేని బుద్ధునితో సరితూగే మరో మూర్తిమత్వాన్ని సృష్టించాలని, రాముణ్ణి తయారు చేశారని ఒక వాదం ఉంది. రాముణ్ణి తయారు చేశారని భావించడానికి కొన్ని ఆధారాలున్నాయి. బుద్ధుని గురువు వెస్సామిత్త. వెస్సా మిత్త అంటే విశ్వామిత్రుడు. రాముని విషయంలో విశ్వామిత్ర పాత్ర అందరికీ తెలిసిందే. ఆ వెస్సామిత్త నుంచే విశ్వామిత్ర పాత్రను సృష్టించాడు వాల్మీకి. బౌద్ధ వెస్సామిత్త రామాయణ విశ్వామిత్ర కావడం యాదృచ్చికం కాదు. 20వ శతాబ్దంలో బౌద్ధం పునరుజ్జీవం పొందింది. ప్రపంచం నేటి మారిన విలువలకు బౌద్ధం అనుగుణమైందని భావించి అంటే హేతువాదం, మానవవాదం, లౌకికవాదం, స్వేచ్చా స్వాతంత్ర్యాలు, ప్రజాస్వామ్యం లాంటి భావనలు బౌద్ధానికి దగ్గరివని భావించి, దానిని గురించి ఆసక్తితో తెలుసుకొంటోంది. బౌద్ధేతివృత్తాలతో సృజనాత్మక రచనలే కాక, బౌద్ధ దార్శనిక సాహిత్యం కూడ వివిధ భాషలలో వెలువడుతోంది. ఆ పరంపరలోదే 'మానవీయ బుద్ధ' కూడా.© 2017,www.logili.com All Rights Reserved.