ఇందులో మొత్తం 6 పుస్తకాలు కలవు...
మనిషి బలం అతడు ప్రతిబింబించే భావాల బలం మీద ఆధారపడి ఉంటుంది. అంబేద్కర్ మహాశయుని బలం ఆయన భావాల పటిమ మీద ఆధారపడి ఉంది. ఆయన భావాలు బలమైనవి కావడం కారణంగానే, భారతదేశంలో ఆయన ఒక మహాశక్తిగా ఎదగగలిగాడు. అటువంటి మహాశయుని అడుగుజాడలలో, ఆయన బౌద్ధస్పూర్తిని తీసుకొని, శ్రీ రాజా, వారి జీవన సహచరి శ్రీమతి లతలు, బౌద్ధ దీక్ష తీసుకొని పంచశీలను అనుశీలనం చేశారు. సర్వ అనర్థాలకు, స్వార్థానికి మూలమని బుద్ధుడు చెప్పిన "నేను", "నన్ను", "నాది" భావనలను పరిహరించి, తమ ఆర్జనలో కొంత భాగాన్ని దీన జన ఉద్ధరణకు వినియోగించారు.
బుద్ధ కరుణా ప్లావితయైన శ్రీమతి లత సమాజ సేవకు అంకితమై, భర్త రాజా స్థాపించిన చైతన్య ఆర్టు ధియేటరు, సాహితీ సామాజిక సంస్థ ఎగ్జోటిక్ ఈవెంట్స్ ల వ్యాపార సంస్థలకు తాను జీవగర్ర అయి, వాటికి జవసత్వాలను కూర్చింది. బౌద్ధ ఉపాసకా, ఉపాసికలైన వారిద్దరూ తమ జీవితాలలో పంచశీలను పండించుకొంటున్నప్పుడు వారి జీవన గమనం ఎంత స్నేహపూర్వకంగా ఉంటుందో వేరే చెప్పేపని లేదు.
దురదృష్టం ఏమిటంటే, ఆమె అల్పాయుష్కురాలుగా - అంటే 49 యేళ్ళు ఉన్నప్పుడే - ఆమె దేహం నాలుగు భూతాలలో కలిసిపోయింది. అయినా ఆమె మరణించలేదు. ఆమె స్పూర్తి, రాజాలో సజీవంగా ఉంది చోదక శక్తిగా పనిచేస్తోంది. అందుకని రాజా ఒకరు కాదు - ఇద్దరు. బౌద్ధం, దశపారమితలలో దానానికి అగ్రాసనం వేస్తుంది. అలాంటప్పుడు ఇద్దరూ ఒకరైన రాజా మరి దానాన్ని ఎలా విస్మరించగలరు? ఆ స్పూర్తితోనే వారిద్దరూ ఈ బుద్ధ వచనాన్ని తెలుగు లోకానికి అందించే మహా యజ్ఞానికి దాయికలయ్యారు. ఈ కారణంగా తెలుగు బౌద్ధలోకం ఈ మహాదాయిక లిద్దరికీ సర్వదా కృతజ్ఞత చూపుతుంది.
- అన్నపరెడ్డి బుద్ధగోషుడు
ఇందులో మొత్తం 6 పుస్తకాలు కలవు... మనిషి బలం అతడు ప్రతిబింబించే భావాల బలం మీద ఆధారపడి ఉంటుంది. అంబేద్కర్ మహాశయుని బలం ఆయన భావాల పటిమ మీద ఆధారపడి ఉంది. ఆయన భావాలు బలమైనవి కావడం కారణంగానే, భారతదేశంలో ఆయన ఒక మహాశక్తిగా ఎదగగలిగాడు. అటువంటి మహాశయుని అడుగుజాడలలో, ఆయన బౌద్ధస్పూర్తిని తీసుకొని, శ్రీ రాజా, వారి జీవన సహచరి శ్రీమతి లతలు, బౌద్ధ దీక్ష తీసుకొని పంచశీలను అనుశీలనం చేశారు. సర్వ అనర్థాలకు, స్వార్థానికి మూలమని బుద్ధుడు చెప్పిన "నేను", "నన్ను", "నాది" భావనలను పరిహరించి, తమ ఆర్జనలో కొంత భాగాన్ని దీన జన ఉద్ధరణకు వినియోగించారు. బుద్ధ కరుణా ప్లావితయైన శ్రీమతి లత సమాజ సేవకు అంకితమై, భర్త రాజా స్థాపించిన చైతన్య ఆర్టు ధియేటరు, సాహితీ సామాజిక సంస్థ ఎగ్జోటిక్ ఈవెంట్స్ ల వ్యాపార సంస్థలకు తాను జీవగర్ర అయి, వాటికి జవసత్వాలను కూర్చింది. బౌద్ధ ఉపాసకా, ఉపాసికలైన వారిద్దరూ తమ జీవితాలలో పంచశీలను పండించుకొంటున్నప్పుడు వారి జీవన గమనం ఎంత స్నేహపూర్వకంగా ఉంటుందో వేరే చెప్పేపని లేదు. దురదృష్టం ఏమిటంటే, ఆమె అల్పాయుష్కురాలుగా - అంటే 49 యేళ్ళు ఉన్నప్పుడే - ఆమె దేహం నాలుగు భూతాలలో కలిసిపోయింది. అయినా ఆమె మరణించలేదు. ఆమె స్పూర్తి, రాజాలో సజీవంగా ఉంది చోదక శక్తిగా పనిచేస్తోంది. అందుకని రాజా ఒకరు కాదు - ఇద్దరు. బౌద్ధం, దశపారమితలలో దానానికి అగ్రాసనం వేస్తుంది. అలాంటప్పుడు ఇద్దరూ ఒకరైన రాజా మరి దానాన్ని ఎలా విస్మరించగలరు? ఆ స్పూర్తితోనే వారిద్దరూ ఈ బుద్ధ వచనాన్ని తెలుగు లోకానికి అందించే మహా యజ్ఞానికి దాయికలయ్యారు. ఈ కారణంగా తెలుగు బౌద్ధలోకం ఈ మహాదాయిక లిద్దరికీ సర్వదా కృతజ్ఞత చూపుతుంది. - అన్నపరెడ్డి బుద్ధగోషుడు
© 2017,www.logili.com All Rights Reserved.