అశోక్ సామ్రాట్ గురించిన కథలు, గాథలు చాలానే వింటూ ఉంటాం. అత్యంత క్రూరుడూ, హింసావాది అయిన అశోకుడు అహింసావాదిగా ఎలా మారాడు? కళింగ యుద్ధంలో జరిగిన ఏ సంఘటనలు అశోకుణ్ణి బౌద్ధం వైపుకు మరల్చాయి? అన్న విషయాలను చంద్రగుప్త విద్యాలంకార్ గారు తన నాటకంలో రసాత్మకంగా వర్ణించారు. ఈ 'అశోక్' నాటకాన్ని కొన్ని రాష్ట్రాల విశ్వవిద్యాలయాలు, దక్షిణ భారతహిందీ ప్రచార సభవారు కొన్ని డిగ్రీ క్లాసులకు పాఠ్యగ్రంథంగా ఉంచాయి. హిందీ వాడకం అంతగాలేని పంజాబ్ లాంటి చోట్ల కూడా ఇది పాఠ్యగ్రంథంగా ఉంచబడటం రచయితకు చాలా సంతోషం కలిగించిన విషయం. అలాంటి విశిష్టమైన నాటకాన్ని మన తెలుగు పాఠకులకు కూడా పరిచయం చేయాలని 'ధమ్మం శరణం గచ్ఛామి' అను పేరుతో నవలగా అనువదించాను.
- దాసరి శివకుమారి
అశోక్ సామ్రాట్ గురించిన కథలు, గాథలు చాలానే వింటూ ఉంటాం. అత్యంత క్రూరుడూ, హింసావాది అయిన అశోకుడు అహింసావాదిగా ఎలా మారాడు? కళింగ యుద్ధంలో జరిగిన ఏ సంఘటనలు అశోకుణ్ణి బౌద్ధం వైపుకు మరల్చాయి? అన్న విషయాలను చంద్రగుప్త విద్యాలంకార్ గారు తన నాటకంలో రసాత్మకంగా వర్ణించారు. ఈ 'అశోక్' నాటకాన్ని కొన్ని రాష్ట్రాల విశ్వవిద్యాలయాలు, దక్షిణ భారతహిందీ ప్రచార సభవారు కొన్ని డిగ్రీ క్లాసులకు పాఠ్యగ్రంథంగా ఉంచాయి. హిందీ వాడకం అంతగాలేని పంజాబ్ లాంటి చోట్ల కూడా ఇది పాఠ్యగ్రంథంగా ఉంచబడటం రచయితకు చాలా సంతోషం కలిగించిన విషయం. అలాంటి విశిష్టమైన నాటకాన్ని మన తెలుగు పాఠకులకు కూడా పరిచయం చేయాలని 'ధమ్మం శరణం గచ్ఛామి' అను పేరుతో నవలగా అనువదించాను. - దాసరి శివకుమారి© 2017,www.logili.com All Rights Reserved.