గురూజీ స్వామి మైత్రేయ ప్రాచీన భారతీయ ఆధ్యాత్మిక యోగ గురుపరంపరకు చెందినవారు. దాదాపు ఇరవై ఒక్క మంది గురువుల ద్వారా అనేకశాఖలలో – హఠయోగ, రాజయోగ, ఉపనిషత్తులు, బౌద్ధం, జెన్, సూఫీయిజం, తంత్ర, హస్సిడిజమ్, విపాసన, రేకీ, ప్రాణిక్ హీలింగ్, సిద్ధ, ఆయుర్వేద, ఏరోబిక్స్, హిప్నాటిజమ్‌లలో శిక్షణ పొంది, వాటిని అధ్యయనం చేసిన వారు.
గత 35 సంవత్సరాల తమ నిరంతర సాధన ద్వారా భారతీయ ప్రాచీన విజ్ఞానంలో మరుగున పడిపోయిన అనేక పద్ధతులను తిరిగి వెలుగులోకి తెచ్చారు గురూజీ. అత్యంత క్లిష్టమైన తత్త్వ, వేదాంత సత్యాలను సామాన్యులకు అర్థమయ్యే సరళమైన భాషలో విప్పి చెప్పడం వారి ప్రత్యేకత.