నమో తస్స భగవతో అరహతో సమ్మాసంబుద్ధస్స
దీఘనికాయ - శీలస్కంధవర్గం
1. బ్రహ్మజాల సూత్రం
పరివ్రాజక కథ
1 నేనిలా విన్నాను - ఒక సమయంలో భగవానుడు అయిదువందల భిక్షువులు గల పెద్ద భికుసంఘంతో రాజగృహ నగరానికి నాలందాకు మధ్య త్రోవలో నడుస్తున్నాడు. సుప్రియ పరివ్రాజకుడు కూడా తన శిష్యుడు బ్రహ్మదత్తమాణవకుని (మాణవకుడు - యువబ్రహ్మచారి) తో రాజగిరికి - నాలందాకు మధ్య త్రోవలో నడుస్తున్నాడు. అప్పుడు సుప్రియపరివ్రాజకుడు అనేకవిధాలుగా బుద్దున్ని నిందిస్తూ మాట్లాడాడు. ధమ్మాన్ని నిందిస్తూ మాట్లాడాడు. సంఘాన్ని నిందిస్తూ మాట్లాడాడు. కాని సుప్రియ పరివ్రాజకుని శిష్యుడు బ్రహ్మదత్తమాణవకుడు అనేక విధాలుగా బుద్దున్ని ప్రశంసిస్తూ మాట్లాడాడు. ధమ్మాన్ని ప్రశంసిస్తూ మాట్లాడాడు. సంఘాన్ని ప్రశంసిస్తూ మాట్లాడాడు. ఇలా ఆ గురుశిష్యులిద్దరూ ఒకరికి వ్యతిరేకంగా ఒకరు మాట్లాడుకుంటూ, భగవానునికి, బికుసంఘానికి వెనుక వెనుకనే నడిచారు.
© 2017,www.logili.com All Rights Reserved.