“సర్వాసుర వినాశా చ సర్వదానవ ఘాతినే
సర్వశాస్త్రమయీ సత్యా సర్వాస్త్రధారిణీ”
అని వివిధ పురాణాలలో స్తుతించబడిన విశిష్ట దేవత భగవతి. ఆమె సర్వాస్త్రములను ధరించి దుర్మార్గులైన రాక్షసులను సంహరిస్తుంది. సకల లోకాలలోని దుర్మార్గాన్ని నశింపజేస్తుంది. ఆ సమయంలో ఆమె రౌద్ర రూపిణి సమస్తలోకాలలోని దుర్మార్గాన్ని నశింపచేసి ఆమె సన్మార్గులను సంరక్షిస్తుంది. అప్పుడు ఆమె కరుణామయి. ఆమెలోని యీ వైవిధ్యాన్ని అర్థం చేసుకొనటమే ఆధ్యాత్మిక జ్ఞానం. అదే పరమసత్యం. ఆ ఆధ్యాత్మిక జ్ఞానమే సకల పురాణాలలోనూ, శాస్త్రాలలోనూ వివరింపబడినది కనుకనే ఆమె సర్వశాస్త్రమయి. సత్యస్వరూపిణి.
భగవతి కుల, లింగ భేదాలు లేకుండా భారతదేశమంతటా ఆరాధింపబడుతుంది. మన త్రిలింగ దేశంలో ప్రాచీనకాలంలో దేవీ పూజ విరివిగా చెయ్యబడిందనటానికి అనేక చారిత్రక ఆధారాలున్నాయి. కాని ప్రస్తుతం తెలుగు ప్రజలలో దేవీ పూజ చాల తక్కువగా ఉన్నదనే చెప్పాలి. అందుకు చాలా కారణాలున్నాయి. దేవీ పూజలోని ఉత్కృష్టతను అందరికీ అర్థమయ్యేలా వివరించి చెప్పే పుస్తకం లేకపోవటం ఆ కారణాలలో ఒకటి అనిపించటం వలన యీ పుస్తకం వ్రాయటం జరిగింది.
ఆధ్యాత్మిక తత్త్వాన్ని ఆసక్తికరంగా కథారూపంలో వివరిస్తేనే సామాన్య పాఠకులు సులభంగా గ్రహించగలుగుతారు. ఆ ప్రయోజనాన్ని సాధించటానికే పురాణేతిహాసాలు వ్రాయబడినాయి. కానీ యీ కాలంలో మరీ పెద్ద గ్రంథాలను చదివే తీరికా, ఓపికా ప్రజలకు లేవు. ఇప్పటి ప్రజలచేత చదవబడాలంటే సరిగా ఉండాలి. విషయం క్లుప్తంగానూ, సూటిగానూ వివరించబడాలి. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని వ్రాయబడ్డది.
పుస్తకం మొదటి భాగంలో జగన్మాత దైత్య సంహారానికీ, పార్వతీపు కళ్యాణానికి సంబంధించిన గాథలు గద్యకావ్య రీతిలో వ్రాయబడి తరువాతి భాగంలో భగవతి ఆరాధనలోని ఆధ్యాత్మిక తత్త్వము. విషయాలు సాధారణ వచన రీతిలో వివరింపబడినాయి. వివిధ పరామం హాసాలలోని గాథలనూ, యితరస్తుతులను పరిశీలించి ప్రామాణికమైన విషయాలను సంగ్రహించి యీ పుస్తకం వ్రాయబడినది.
నా మొదటి పుస్తకం 'తాత్విక గాథలు' పాఠకుల మెప్పును పొందింది. జగన్మాత ఆరాధన గురించి వ్రాయబడిన యీ రెండవ పుస్తకాన్ని పాఠకులు యింకా ఎక్కువగా ఆదరిస్తారని ఆశిస్తున్నాను.
ఈ పుస్తకం పారమార్థిక చింతన కలవాళ్ళకు ఆధ్యాత్మిక ఆనందాన్నీ, సాధారణ పాఠకులకు రసానందాన్నీ, జగన్మాత ఆరాధన మీద కలుగచేయాలని జగన్మాతను ప్రార్థిస్తున్నాను.
- వి.శివప్రసాదరావు
“సర్వాసుర వినాశా చ సర్వదానవ ఘాతినే సర్వశాస్త్రమయీ సత్యా సర్వాస్త్రధారిణీ” అని వివిధ పురాణాలలో స్తుతించబడిన విశిష్ట దేవత భగవతి. ఆమె సర్వాస్త్రములను ధరించి దుర్మార్గులైన రాక్షసులను సంహరిస్తుంది. సకల లోకాలలోని దుర్మార్గాన్ని నశింపజేస్తుంది. ఆ సమయంలో ఆమె రౌద్ర రూపిణి సమస్తలోకాలలోని దుర్మార్గాన్ని నశింపచేసి ఆమె సన్మార్గులను సంరక్షిస్తుంది. అప్పుడు ఆమె కరుణామయి. ఆమెలోని యీ వైవిధ్యాన్ని అర్థం చేసుకొనటమే ఆధ్యాత్మిక జ్ఞానం. అదే పరమసత్యం. ఆ ఆధ్యాత్మిక జ్ఞానమే సకల పురాణాలలోనూ, శాస్త్రాలలోనూ వివరింపబడినది కనుకనే ఆమె సర్వశాస్త్రమయి. సత్యస్వరూపిణి. భగవతి కుల, లింగ భేదాలు లేకుండా భారతదేశమంతటా ఆరాధింపబడుతుంది. మన త్రిలింగ దేశంలో ప్రాచీనకాలంలో దేవీ పూజ విరివిగా చెయ్యబడిందనటానికి అనేక చారిత్రక ఆధారాలున్నాయి. కాని ప్రస్తుతం తెలుగు ప్రజలలో దేవీ పూజ చాల తక్కువగా ఉన్నదనే చెప్పాలి. అందుకు చాలా కారణాలున్నాయి. దేవీ పూజలోని ఉత్కృష్టతను అందరికీ అర్థమయ్యేలా వివరించి చెప్పే పుస్తకం లేకపోవటం ఆ కారణాలలో ఒకటి అనిపించటం వలన యీ పుస్తకం వ్రాయటం జరిగింది. ఆధ్యాత్మిక తత్త్వాన్ని ఆసక్తికరంగా కథారూపంలో వివరిస్తేనే సామాన్య పాఠకులు సులభంగా గ్రహించగలుగుతారు. ఆ ప్రయోజనాన్ని సాధించటానికే పురాణేతిహాసాలు వ్రాయబడినాయి. కానీ యీ కాలంలో మరీ పెద్ద గ్రంథాలను చదివే తీరికా, ఓపికా ప్రజలకు లేవు. ఇప్పటి ప్రజలచేత చదవబడాలంటే సరిగా ఉండాలి. విషయం క్లుప్తంగానూ, సూటిగానూ వివరించబడాలి. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని వ్రాయబడ్డది. పుస్తకం మొదటి భాగంలో జగన్మాత దైత్య సంహారానికీ, పార్వతీపు కళ్యాణానికి సంబంధించిన గాథలు గద్యకావ్య రీతిలో వ్రాయబడి తరువాతి భాగంలో భగవతి ఆరాధనలోని ఆధ్యాత్మిక తత్త్వము. విషయాలు సాధారణ వచన రీతిలో వివరింపబడినాయి. వివిధ పరామం హాసాలలోని గాథలనూ, యితరస్తుతులను పరిశీలించి ప్రామాణికమైన విషయాలను సంగ్రహించి యీ పుస్తకం వ్రాయబడినది. నా మొదటి పుస్తకం 'తాత్విక గాథలు' పాఠకుల మెప్పును పొందింది. జగన్మాత ఆరాధన గురించి వ్రాయబడిన యీ రెండవ పుస్తకాన్ని పాఠకులు యింకా ఎక్కువగా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఈ పుస్తకం పారమార్థిక చింతన కలవాళ్ళకు ఆధ్యాత్మిక ఆనందాన్నీ, సాధారణ పాఠకులకు రసానందాన్నీ, జగన్మాత ఆరాధన మీద కలుగచేయాలని జగన్మాతను ప్రార్థిస్తున్నాను. - వి.శివప్రసాదరావు© 2017,www.logili.com All Rights Reserved.