సర్వ సాహిత్య ప్రక్రియల్లోను ఉత్కృష్టమైనది, రమ్యమైనది నాటకం. అయినా రచయితలు అంతగా నాటకం వైపురారు. కలం పట్టిన ప్రతివాడు కవితల వైపో, కథల వైపో నడుస్తున్న ఈ కాలంలో క్లిష్టమైన నాటక, నాటిక రచనల వైపు దృష్టి సారించడమే - ఒక విలక్షణత. నాటక రచన అంటే వచన రచన మాత్రమే కాదు. శ్రవణం, దృశ్వీకరణం రంగరిస్తూ సాగే ప్రక్రియ. అసలిది రచించటమే కాదు. చెప్పడం. ఇది చదవటానికి కాదు, చూడటానికి, వినడానికి. అందుకే నాటకంతాహి సాహిత్యం అంటాడు కాళిదాసు. అంటే రచయిత అనుభవ సంపన్నుడయిన పిదవ సాహిత్య కృషిలో చివరగా, పరాకాష్టగా చేపట్టవలసిన ప్రక్రియ నాటక రచన. అయితే శ్రీ వి. ఆర్. వి. స్వయంగా నటుడు కావటం వలన, తన భావ ప్రకటనకు, మొదటి ప్రయత్నంలోనే నాటికను వాహికగా ఎంచుకున్నారు.
- వి. ఆర్. వి