అహోబలపండితీయం మనకు మూలమాంధ్ర శబ్దచింతామణి. దీనిని నన్నయభట్టు 11వ శతాబ్ది ప్రారంభమున వ్రాసియుండెను. భారత రచనకంటే పూర్వమే ఇది అవతరించి ఉండెనని కొందరి సిద్ధాంతము. తెలుగు భాష కిదే మొట్టమొదటి వ్యాకణ గ్రంథము. సంస్కృతభాషలో శ్లోకరూపముగా వ్రాయబడి యున్నది. బాల సరస్వతికి దొరికిన చింతామణి ప్రతిలో 88 శ్లోకములున్నవనియు, నప్పకవికి లభించిన ప్రతిలో 82 శ్లోకములు మాత్రమే ఉన్నాయని అహోబలపండితుడు కృత్యాది శ్లోకములలో వెల్లడించి ఉండెను. ఈ చింతామణినే నన్నయభట్టీయ మందురు.
ఈ నూతన ముద్రణను తిలకించి అభినందనము - ఆశాసనము అన్న పేరుతో తమ అభిప్రాయ మోసంగిన మద్గురువరేన్యులు శ్రీ దువ్వూరి వెంకట రమణశాస్త్రి గారికి, కృతజ్ఞతా సూచక పరశ్శత వందనములు ఆచరిస్తున్నాను.
అహోబలపండితీయం మనకు మూలమాంధ్ర శబ్దచింతామణి. దీనిని నన్నయభట్టు 11వ శతాబ్ది ప్రారంభమున వ్రాసియుండెను. భారత రచనకంటే పూర్వమే ఇది అవతరించి ఉండెనని కొందరి సిద్ధాంతము. తెలుగు భాష కిదే మొట్టమొదటి వ్యాకణ గ్రంథము. సంస్కృతభాషలో శ్లోకరూపముగా వ్రాయబడి యున్నది. బాల సరస్వతికి దొరికిన చింతామణి ప్రతిలో 88 శ్లోకములున్నవనియు, నప్పకవికి లభించిన ప్రతిలో 82 శ్లోకములు మాత్రమే ఉన్నాయని అహోబలపండితుడు కృత్యాది శ్లోకములలో వెల్లడించి ఉండెను. ఈ చింతామణినే నన్నయభట్టీయ మందురు. ఈ నూతన ముద్రణను తిలకించి అభినందనము - ఆశాసనము అన్న పేరుతో తమ అభిప్రాయ మోసంగిన మద్గురువరేన్యులు శ్రీ దువ్వూరి వెంకట రమణశాస్త్రి గారికి, కృతజ్ఞతా సూచక పరశ్శత వందనములు ఆచరిస్తున్నాను.© 2017,www.logili.com All Rights Reserved.