ఈ రచన పేరు అనంత కాలచక్రం. గడియారములోని చేతులవలె అంతులేని పరిభ్రమణము కలిగినది, పునరావృత్తమయ్యేది కాలము. కాలానికొక ఆవృత్తి కల్పము. సృష్టి ప్రారంభమై అంతము అయ్యేవరకూ గడిచే కాలము పేరు కల్పము. ఇందులో పదునాలుగు మన్వంతరములు ఉన్నవి. ఊర్ద్వలోకముల నుండి బ్రహ్మాండములో జీవులు పుట్టటము, సంఘర్షణలు, జీవులు క్రమముగా క్రింద లోకాలకి వ్యాపించడము ఈ కాలగమనము యొక్క లక్షణము. పదునాలుగు మన్వంతరములలో ఏడు మన్వంతరములు పూర్తయితే గానీ మనుష్య లోకములో జీవకోటి పుట్టటము జరుగదు.
అంతకు ముందు వరకూ మనకు పైనున్న లోకములు సుస్థిరమై త్రిమూర్తులకు శక్తిస్వరూపిణి పరాశక్తి పత్నీ రూపములో కలవటము ఇవన్నీ ఏడు మన్వంతరములు పూర్తి నాటికి అవుతుంది. అపుడే సృష్టి కింద లోకములలో అంటే భూలోకముతో మొదలుపెట్టి దిగువనున్న లోకములలో వ్యాపించవలె. అప్పటికి మనకి పైన ఉన్న లోకములలోని ప్రజాపతుల పరంపర, సృష్టిరహస్యము, కాలచాక్రములోని సృష్టియొక్క కార్యక్రమము వివరముగా అవగతమగుతుంది.
ఈ రచన పేరు అనంత కాలచక్రం. గడియారములోని చేతులవలె అంతులేని పరిభ్రమణము కలిగినది, పునరావృత్తమయ్యేది కాలము. కాలానికొక ఆవృత్తి కల్పము. సృష్టి ప్రారంభమై అంతము అయ్యేవరకూ గడిచే కాలము పేరు కల్పము. ఇందులో పదునాలుగు మన్వంతరములు ఉన్నవి. ఊర్ద్వలోకముల నుండి బ్రహ్మాండములో జీవులు పుట్టటము, సంఘర్షణలు, జీవులు క్రమముగా క్రింద లోకాలకి వ్యాపించడము ఈ కాలగమనము యొక్క లక్షణము. పదునాలుగు మన్వంతరములలో ఏడు మన్వంతరములు పూర్తయితే గానీ మనుష్య లోకములో జీవకోటి పుట్టటము జరుగదు. అంతకు ముందు వరకూ మనకు పైనున్న లోకములు సుస్థిరమై త్రిమూర్తులకు శక్తిస్వరూపిణి పరాశక్తి పత్నీ రూపములో కలవటము ఇవన్నీ ఏడు మన్వంతరములు పూర్తి నాటికి అవుతుంది. అపుడే సృష్టి కింద లోకములలో అంటే భూలోకముతో మొదలుపెట్టి దిగువనున్న లోకములలో వ్యాపించవలె. అప్పటికి మనకి పైన ఉన్న లోకములలోని ప్రజాపతుల పరంపర, సృష్టిరహస్యము, కాలచాక్రములోని సృష్టియొక్క కార్యక్రమము వివరముగా అవగతమగుతుంది.© 2017,www.logili.com All Rights Reserved.