సీమ సాహిత్యంలో లబ్ధప్రతిష్టులైన అనంత సాహితీమూర్తులు ఎందరోవున్నారు. ఆధునిక భావజాలము, సామాజిక స్పృహ, సాహితీ చైతన్య శీలత్వము ముప్పేటగా తెలుగు సాహిత్యానికి చిరకాలంగా అనంతపురము జిల్లా నుండి సేవలందిస్తున్న వారు వర్తమానకాలంలో సైతం మరెందరో ఉన్నారు. వీరిలో అనంత సాహిత్యంలో కథ, సామాజికస్పృహ, కవిత రూపాలకు ప్రతినిధులుగా స్థాలీపులాకన్యాయంగా ప్రస్తుత రచనలో స్వీకరించబడిన ముగ్గురు అనంత సాహితీమూర్తులు సింగమనేని నారాయణ, డా జూపల్లి ప్రేమ్ చంద్, మల్లెల నరసింహమూర్తి. తెలుగు సాహిత్యంలో వీరి విశిష్ట పాత్రను భిన్నరూపంలో దర్శించి ఇప్పటిదాకా ఎందరో విశ్లేషణ గావించి వున్నప్పటికిని ప్రస్తుత వ్యాససంపుటి వీరి సాహిత్యకృషిపై మరొక్కసారి తనదైన దృష్టికోణంలో కొనసాగిన ఒక రచన.
- డా పి రమేష్ నారాయణ
సీమ సాహిత్యంలో లబ్ధప్రతిష్టులైన అనంత సాహితీమూర్తులు ఎందరోవున్నారు. ఆధునిక భావజాలము, సామాజిక స్పృహ, సాహితీ చైతన్య శీలత్వము ముప్పేటగా తెలుగు సాహిత్యానికి చిరకాలంగా అనంతపురము జిల్లా నుండి సేవలందిస్తున్న వారు వర్తమానకాలంలో సైతం మరెందరో ఉన్నారు. వీరిలో అనంత సాహిత్యంలో కథ, సామాజికస్పృహ, కవిత రూపాలకు ప్రతినిధులుగా స్థాలీపులాకన్యాయంగా ప్రస్తుత రచనలో స్వీకరించబడిన ముగ్గురు అనంత సాహితీమూర్తులు సింగమనేని నారాయణ, డా జూపల్లి ప్రేమ్ చంద్, మల్లెల నరసింహమూర్తి. తెలుగు సాహిత్యంలో వీరి విశిష్ట పాత్రను భిన్నరూపంలో దర్శించి ఇప్పటిదాకా ఎందరో విశ్లేషణ గావించి వున్నప్పటికిని ప్రస్తుత వ్యాససంపుటి వీరి సాహిత్యకృషిపై మరొక్కసారి తనదైన దృష్టికోణంలో కొనసాగిన ఒక రచన. - డా పి రమేష్ నారాయణ© 2017,www.logili.com All Rights Reserved.