భారతీయ సాహిత్యంలో యాత్రా చరిత్రకు పితామహుడు రాహుల్ సాంకృత్యాయన్. బౌద్ధ ధర్మానికి సంబంధించిన అరుదైన పుస్తకాలను సేకరించి, అనువదించే అన్వేషణలో రాహుల్ జీ జరిపిన టిబెట్ యాత్రా విశేషాలను 'తిబ్బత్ మే సేవా బరన్' పేరుతో 1934 సంవత్సరంలో పుస్తకంగా ప్రచురించారు. ఎనిమిది దశాబ్దాల తర్వాత శ్రీమతి పారన్నది దీన్ని టిబెట్ లో 15 నెలలు పేరుతో తెలుగులోకి అనువదించారు.
శ్రీలంక నుండి టిబెట్ వరకూ సాగే ఈ ప్రయాణంలో టిబెట్ పర్వతాలు, నదులు, దుర్గమారణ్యాలు అక్కడి వారి అనుదిన జీవనం. ఆచార వ్యవహారాలు రాహుల్ జీ, శక్తివంతమైన నిరాడంబర వచనంలో ఇమిడిపోయి మన కళ్ళకు కట్టినట్టుగా రూపాంతరం చెందుతాయి. హిందీ భాషలో వెలువడిన ఈ మొదటి యాత్రా చరిత్ర గ్రంథంలో టిబెట్ భాషా సాహిత్య సంస్కృతుల పూర్వాపరాలతో పాటు అక్కడి బౌద్ధమత ఆవిర్భావ, వికాస, క్షీణ దశలను ఆసక్తికరంగా వివరిస్తాడు. అత్యంత క్లిష్టంగా ఉండే టిబెటన్ బౌద్ధాన్ని సులభమైన పదాలలో పాఠకులకు పరిచయం చేస్తాడు. బౌద్ధ తాళపత్ర చరిత్రను ఎంత సునిశితంగా పరిష్కరిస్తాడో అంతే నేర్పుతో టిబెట్ రాజ సంస్థానాల చరిత్రనూ, సాధారణ ప్రజల జీవనగాథలనూ వివరిస్తాడు. నిజానికి యాత్రా చరిత్ర రూపంలో ఒదిగిన టిబెట్ దేశ సంస్కృతీ చరిత్ర ఈ పుస్తకం!
భారతీయ సాహిత్యంలో యాత్రా చరిత్రకు పితామహుడు రాహుల్ సాంకృత్యాయన్. బౌద్ధ ధర్మానికి సంబంధించిన అరుదైన పుస్తకాలను సేకరించి, అనువదించే అన్వేషణలో రాహుల్ జీ జరిపిన టిబెట్ యాత్రా విశేషాలను 'తిబ్బత్ మే సేవా బరన్' పేరుతో 1934 సంవత్సరంలో పుస్తకంగా ప్రచురించారు. ఎనిమిది దశాబ్దాల తర్వాత శ్రీమతి పారన్నది దీన్ని టిబెట్ లో 15 నెలలు పేరుతో తెలుగులోకి అనువదించారు. శ్రీలంక నుండి టిబెట్ వరకూ సాగే ఈ ప్రయాణంలో టిబెట్ పర్వతాలు, నదులు, దుర్గమారణ్యాలు అక్కడి వారి అనుదిన జీవనం. ఆచార వ్యవహారాలు రాహుల్ జీ, శక్తివంతమైన నిరాడంబర వచనంలో ఇమిడిపోయి మన కళ్ళకు కట్టినట్టుగా రూపాంతరం చెందుతాయి. హిందీ భాషలో వెలువడిన ఈ మొదటి యాత్రా చరిత్ర గ్రంథంలో టిబెట్ భాషా సాహిత్య సంస్కృతుల పూర్వాపరాలతో పాటు అక్కడి బౌద్ధమత ఆవిర్భావ, వికాస, క్షీణ దశలను ఆసక్తికరంగా వివరిస్తాడు. అత్యంత క్లిష్టంగా ఉండే టిబెటన్ బౌద్ధాన్ని సులభమైన పదాలలో పాఠకులకు పరిచయం చేస్తాడు. బౌద్ధ తాళపత్ర చరిత్రను ఎంత సునిశితంగా పరిష్కరిస్తాడో అంతే నేర్పుతో టిబెట్ రాజ సంస్థానాల చరిత్రనూ, సాధారణ ప్రజల జీవనగాథలనూ వివరిస్తాడు. నిజానికి యాత్రా చరిత్ర రూపంలో ఒదిగిన టిబెట్ దేశ సంస్కృతీ చరిత్ర ఈ పుస్తకం!© 2017,www.logili.com All Rights Reserved.