పిల్లల కథలు
ఆపదనుంచి తప్పించుకున్న అమ్మాయి
ఒక పట్టణంలో రాఘవయ్య అనే మనిషి నివసిస్తుండేవాడు. అతనికో మిల్లు వుంది. ఆ మిల్లే అతని బ్రతుకుతెరువుకు ఆధారం. అతని ఇంటివెనుక స్థలంలో ఒక యాపిల్ చెట్టు వుండేది. అతనికి వేరే ఆస్త్రేమీ లేదు. ఆ మిల్లుతో వచ్చిన ధనం వారి కుటుంబానికి సరిపోయేది కాదు. రోజులు గడిచేకొద్ది అతను బీదరికంతో, జరుగుబాటు కాక బాధపడేవాడు. ప్రతిరోజూ అతను అడవికి వెళ్లి కట్టెలు కొట్టి తెచ్చుకొనేవాడు. అతను కట్టెలు కొట్టటానికి వెళ్తూండగా మార్గమధ్యంలో అతనికి ఒక ముదుసలి ఎదురయ్యాడు. రాఘవయ్య, ఆ కొత్తమనిషిని ఇంతకు ముందెన్నడూ చూడలేదు.
ఆ వృద్ధుడు రాఘవయ్యను పలుకరిస్తూ "నువ్విలా కట్టెలు కొట్టి, వాటిని మోసుకెళ్ళే శ్రమ కాకుండా నువ్వు గొప్పవాడివి అయ్యేలా నేను చేస్తాను. నేను ఆ సహాయం చేసినందుకు ఇప్పుడు ఈ క్షణంలో నీ మిల్లు వెనుకభాగంలో ఏదైతే వుందో, దాన్ని నాకు ఇస్తానని వాగ్దానం చెయ్యి" అన్నాడు.
రాఘవయ్య ఓ క్షణంపాటు ఆలోచించాడు. 'తన మిల్లు వెనుకాల ఇప్పుడే ముంటుంది ఎప్పుడూ వుండే యాపిల్ చెట్టు తప్ప, ఇప్పుడయినా ఆ చెట్టు ఒకటే వుంటుంది. ఆ యాపిల్ చెట్టును ముసలిమనిషికి ధారాదత్తం చేసినందువల్ల నాకు నష్టమేమీ లేదు. తనకు సంపద చేకూర్చే ఆ మనిషికి ఆ చెట్టును ఇచ్చేస్తాను' అనుకుని, అతని మాటలకు అంగీకరించాడు రాఘవయ్య.
వెంటనే వారిద్దరూ, ఆ ఒప్పందం సమయాన్ని కాగితం మీద రాసుకుని రాఘవయ్య తన మిల్లుకు వెనకాల ఆ సమయంలో వున్నదాన్ని తనకు ఇచ్చేటట్లుగా కాగితం మీద రాయించి, రాఘవయ్యచేత సంతకం పెట్టించుకున్నాడు.................
పిల్లల కథలు ఆపదనుంచి తప్పించుకున్న అమ్మాయి ఒక పట్టణంలో రాఘవయ్య అనే మనిషి నివసిస్తుండేవాడు. అతనికో మిల్లు వుంది. ఆ మిల్లే అతని బ్రతుకుతెరువుకు ఆధారం. అతని ఇంటివెనుక స్థలంలో ఒక యాపిల్ చెట్టు వుండేది. అతనికి వేరే ఆస్త్రేమీ లేదు. ఆ మిల్లుతో వచ్చిన ధనం వారి కుటుంబానికి సరిపోయేది కాదు. రోజులు గడిచేకొద్ది అతను బీదరికంతో, జరుగుబాటు కాక బాధపడేవాడు. ప్రతిరోజూ అతను అడవికి వెళ్లి కట్టెలు కొట్టి తెచ్చుకొనేవాడు. అతను కట్టెలు కొట్టటానికి వెళ్తూండగా మార్గమధ్యంలో అతనికి ఒక ముదుసలి ఎదురయ్యాడు. రాఘవయ్య, ఆ కొత్తమనిషిని ఇంతకు ముందెన్నడూ చూడలేదు. ఆ వృద్ధుడు రాఘవయ్యను పలుకరిస్తూ "నువ్విలా కట్టెలు కొట్టి, వాటిని మోసుకెళ్ళే శ్రమ కాకుండా నువ్వు గొప్పవాడివి అయ్యేలా నేను చేస్తాను. నేను ఆ సహాయం చేసినందుకు ఇప్పుడు ఈ క్షణంలో నీ మిల్లు వెనుకభాగంలో ఏదైతే వుందో, దాన్ని నాకు ఇస్తానని వాగ్దానం చెయ్యి" అన్నాడు. రాఘవయ్య ఓ క్షణంపాటు ఆలోచించాడు. 'తన మిల్లు వెనుకాల ఇప్పుడే ముంటుంది ఎప్పుడూ వుండే యాపిల్ చెట్టు తప్ప, ఇప్పుడయినా ఆ చెట్టు ఒకటే వుంటుంది. ఆ యాపిల్ చెట్టును ముసలిమనిషికి ధారాదత్తం చేసినందువల్ల నాకు నష్టమేమీ లేదు. తనకు సంపద చేకూర్చే ఆ మనిషికి ఆ చెట్టును ఇచ్చేస్తాను' అనుకుని, అతని మాటలకు అంగీకరించాడు రాఘవయ్య. వెంటనే వారిద్దరూ, ఆ ఒప్పందం సమయాన్ని కాగితం మీద రాసుకుని రాఘవయ్య తన మిల్లుకు వెనకాల ఆ సమయంలో వున్నదాన్ని తనకు ఇచ్చేటట్లుగా కాగితం మీద రాయించి, రాఘవయ్యచేత సంతకం పెట్టించుకున్నాడు.................© 2017,www.logili.com All Rights Reserved.