కొండేపూడి నిర్మల కవిగా ప్రసిద్ధులు. కానీ కథలు కూడా రాశారు, శతృస్పర్శ అన్న పేరుతో కధాసంపుటి గతంలో ప్రచురించేరు! ఇప్పుడిది వీరి రెండో కధాసంపుటి. ఈ కధాసంపుటితో నిర్మలగారు కథకులుగా కూడా ప్రసిద్ధులవుతారు! కవిత్వం రాసినంత విరివిగా కథలు రాయకపోవడం వల్లనేమో నా వంటి వారు ఈమెను కవిగానే గుర్తుంచుకుంటున్నారు!
వ్యక్తులు, కుటుంబాలు, సమాజాలు, వ్యవస్థలూ – మన జీవితాలను ప్రభావితం చేస్తాయన్నది అనుభవాలలోనున్నదే! గానీ ఆ అనుభవాలను, ఆ ప్రభావాలను అర్ధం చేసుకోవడానికీ, సరిదిద్దుకోవడానికీ, ఉన్నతీకరించుకోవడానికీ ఎరుకను కలిగించేది – సాహిత్యం! సరిగ్గా ఆ ఎరుకను – ఈ కథల్లో ఆయా పాత్రల ద్వారా నిర్మల పాఠకులకు కలిగించే ప్రయత్నం చేశారు! తల్లీబిడ్డలా అనుబంధం, అభిమానం, ప్రేమా – మార్కెట్ లో బ్రాండెడ్ సరుకుల విలువలతో కొలిచే కాలంలో ఉన్నాం! అన్నీ మార్కెట్టే నిర్ణయిస్తుంది.
నిర్మల మంచి వ్యంగ్యం రాయగలరని ఇందులోని ‘మేడమీద వాటా’, ‘ప్రేమజిల్లాలు’, తరగని దూరం కథలు చెప్తాయి. వ్యంగ్యం పదునైన ఆయుధం! తెలుగుసాహిత్యంలో చాలా తక్కువ మందికి ఈ ఆయుధాన్ని గురిపెట్టడం తెలుసు. నిర్మల మరింతగా వ్యంగ్యాయుధాన్ని పదునెక్కించి, దిద్దుబాటు కావాల్సిన, తుద ముట్టించాల్సిన సామాజికాంశాలపై గురిపెట్టాలని కోరుకుంటున్నాను.
అట్టాడ అప్పల్నాయుడు
కొండేపూడి నిర్మల కవిగా ప్రసిద్ధులు. కానీ కథలు కూడా రాశారు, శతృస్పర్శ అన్న పేరుతో కధాసంపుటి గతంలో ప్రచురించేరు! ఇప్పుడిది వీరి రెండో కధాసంపుటి. ఈ కధాసంపుటితో నిర్మలగారు కథకులుగా కూడా ప్రసిద్ధులవుతారు! కవిత్వం రాసినంత విరివిగా కథలు రాయకపోవడం వల్లనేమో నా వంటి వారు ఈమెను కవిగానే గుర్తుంచుకుంటున్నారు! వ్యక్తులు, కుటుంబాలు, సమాజాలు, వ్యవస్థలూ – మన జీవితాలను ప్రభావితం చేస్తాయన్నది అనుభవాలలోనున్నదే! గానీ ఆ అనుభవాలను, ఆ ప్రభావాలను అర్ధం చేసుకోవడానికీ, సరిదిద్దుకోవడానికీ, ఉన్నతీకరించుకోవడానికీ ఎరుకను కలిగించేది – సాహిత్యం! సరిగ్గా ఆ ఎరుకను – ఈ కథల్లో ఆయా పాత్రల ద్వారా నిర్మల పాఠకులకు కలిగించే ప్రయత్నం చేశారు! తల్లీబిడ్డలా అనుబంధం, అభిమానం, ప్రేమా – మార్కెట్ లో బ్రాండెడ్ సరుకుల విలువలతో కొలిచే కాలంలో ఉన్నాం! అన్నీ మార్కెట్టే నిర్ణయిస్తుంది. నిర్మల మంచి వ్యంగ్యం రాయగలరని ఇందులోని ‘మేడమీద వాటా’, ‘ప్రేమజిల్లాలు’, తరగని దూరం కథలు చెప్తాయి. వ్యంగ్యం పదునైన ఆయుధం! తెలుగుసాహిత్యంలో చాలా తక్కువ మందికి ఈ ఆయుధాన్ని గురిపెట్టడం తెలుసు. నిర్మల మరింతగా వ్యంగ్యాయుధాన్ని పదునెక్కించి, దిద్దుబాటు కావాల్సిన, తుద ముట్టించాల్సిన సామాజికాంశాలపై గురిపెట్టాలని కోరుకుంటున్నాను. అట్టాడ అప్పల్నాయుడు© 2017,www.logili.com All Rights Reserved.