ఈ ఆత్మజ్ఞులు వివిధ కాలాలలో వివిధ ప్రదేశాలలో ఈ లోకంలో అవతరించి పరమ సత్యమునకు భక్తియుక్త సేవచేయటం మాత్రమే కాకుండా, మానవ సమాజానికీ ఆధ్యాత్మిక లోకం యొక్క సమాచారమును ప్రచారం చేస్తూ సేవలను అందిస్తుంటారు. తమ గురించి, తమ చుట్టూ గల ప్రపంచం అను ఈ రెండు విషయాల పట్ల కూడా ఆసక్తిని చూపు కుక్కలు మరియు పిల్లుల వలే కాకుండ, మానవ సమాజం కేవలం ఉన్నత ఆశయాల కోసం ఈ విలువైన మానవ శరీరమును ఉపయోగించుకోవాలని ఆత్మజ్ఞులు ఆశిస్తారు. కేవలం మానవులు తప్ప మిగతా ఇతర ప్రాణులలో పరతత్వ విషయమును అర్థం చేసుకోగల శక్తి ఉండదు. కాబట్టి సృష్టిలో మానవజన్మ ఇతర ప్రాణులకన్న ఎందుకు ఉన్నతమైన స్వభావం కలదో మనం అర్థం చేసుకోవాలి.
ఈ ఆత్మజ్ఞులు వివిధ కాలాలలో వివిధ ప్రదేశాలలో ఈ లోకంలో అవతరించి పరమ సత్యమునకు భక్తియుక్త సేవచేయటం మాత్రమే కాకుండా, మానవ సమాజానికీ ఆధ్యాత్మిక లోకం యొక్క సమాచారమును ప్రచారం చేస్తూ సేవలను అందిస్తుంటారు. తమ గురించి, తమ చుట్టూ గల ప్రపంచం అను ఈ రెండు విషయాల పట్ల కూడా ఆసక్తిని చూపు కుక్కలు మరియు పిల్లుల వలే కాకుండ, మానవ సమాజం కేవలం ఉన్నత ఆశయాల కోసం ఈ విలువైన మానవ శరీరమును ఉపయోగించుకోవాలని ఆత్మజ్ఞులు ఆశిస్తారు. కేవలం మానవులు తప్ప మిగతా ఇతర ప్రాణులలో పరతత్వ విషయమును అర్థం చేసుకోగల శక్తి ఉండదు. కాబట్టి సృష్టిలో మానవజన్మ ఇతర ప్రాణులకన్న ఎందుకు ఉన్నతమైన స్వభావం కలదో మనం అర్థం చేసుకోవాలి.© 2017,www.logili.com All Rights Reserved.