భాగవత పురాణాన్ని అధ్యయనం చేయగలగటం ప్రగ్జన్మ సుకృతఫలం. అందలి రసభావాదులను ఆస్వాదించగలగటం ఇంకా పుణ్య విశేషం. ఆ రసభావాదులను పదిమందికి అందించాలనే తపనతో వానికి అక్షరాకృతి కల్పించగలగటం మహా పుణ్యఫలదాయకం. ఈ పనిని సమర్థంగా నిర్వహించిన ప్రభావతిని మనసారా అభినందిస్తున్నాను.
- శలాక రఘునాధశర్మ
భాగవతాన్ని ఒక వ్యాసంగా కాక చిన్న శీర్షికలతో అనేక దృక్కోణాల నుండి వీక్షించి, మనోగతమైన భావాలను అక్షర రూపంగా తీర్చిదిద్దారు. వీటిని చదివినప్పుడు 'ఆనందోబ్రహ్మయటన్న ప్రానుడిని తానా విష్కరించెన్ గదా' అన్న సంజయుని అనుభూతి పూర్వకమైన మాటలు, 'భావస్థిరాణి జననాంతర సౌహృదాని' అన్న కాళిదాసు పలుకులు సార్థకాలవుతాయి.
- లక్ష్మమ్మ
భాగవత పురాణాన్ని అధ్యయనం చేయగలగటం ప్రగ్జన్మ సుకృతఫలం. అందలి రసభావాదులను ఆస్వాదించగలగటం ఇంకా పుణ్య విశేషం. ఆ రసభావాదులను పదిమందికి అందించాలనే తపనతో వానికి అక్షరాకృతి కల్పించగలగటం మహా పుణ్యఫలదాయకం. ఈ పనిని సమర్థంగా నిర్వహించిన ప్రభావతిని మనసారా అభినందిస్తున్నాను. - శలాక రఘునాధశర్మ భాగవతాన్ని ఒక వ్యాసంగా కాక చిన్న శీర్షికలతో అనేక దృక్కోణాల నుండి వీక్షించి, మనోగతమైన భావాలను అక్షర రూపంగా తీర్చిదిద్దారు. వీటిని చదివినప్పుడు 'ఆనందోబ్రహ్మయటన్న ప్రానుడిని తానా విష్కరించెన్ గదా' అన్న సంజయుని అనుభూతి పూర్వకమైన మాటలు, 'భావస్థిరాణి జననాంతర సౌహృదాని' అన్న కాళిదాసు పలుకులు సార్థకాలవుతాయి. - లక్ష్మమ్మ© 2017,www.logili.com All Rights Reserved.