కొన్ని మహా గ్రంథాలు పాఠకుల జీవితాల మీద విశేషమైన ప్రభావం చూపుతాయి. కొన్ని విషయాల పట్ల వారికి అచంచలమైన మౌలిక అభిప్రాయాలు ఏర్పరుస్తాయి.
అటువంటి గ్రంథాలలో అగ్రశ్రేణికి చెందినది శ్రీమద్భాగవతం.
భాగవతం ఏం చెప్తుందో ఒక్క వాక్యంలో చెప్పమంటే, ఇది భక్తి వేదం. అని నిర్వచించారు బమ్మెర పోతన గారు.
నాకు భాగవతంతో అనుబంధం బాల్యం నుంచీ ఏర్పడింది.
అయిదారు సంవత్సరాల వయస్సులో ఉండగా పోతన రత్నాలు అనే పుస్తకంలో పద్యాలు కంఠస్థం చెయ్యడంతో భాగవతం నాకు పరిచయమయింది. అప్పట్లో శ్రీమతి అన్నపూర్ణమ్మగారు అనే కృష్ణ భక్తురాలు పోతనరత్నాలు నుంచి పద్యాలు తప్పులు లేకుండా చదివితే చిన్న పటికబెల్లం ముక్క ఇచ్చేవారు. అదో గొప్ప ఇన్సెంటివ్.
- ఉప్పులూరి కామేశ్వరరావు