నింగికి ముద్దెట్టుకుంటా
నేలకి ముద్దెట్టుకుంటా
గాలికి ముద్దెట్టుకుంటా
గంగమ్మకి ముద్దెట్టుకుంటా
ముచ్చటగా ఎగిరే
ఆ మువ్వన్నెల జెండాకి
మూడు ముద్దులెట్టుకుంటా
నా గుండెకి హత్తుకుంటా
భారత స్వాతంత్ర్య పోరాటంలో
తెరమరుగున కనిపించని త్యాగమూర్తులెందరో
నెత్తురిచ్చి
దేశానికి విముక్తినిచ్చినోళ్ళకి
వైఖరి
మనిషితనం
మాయమైన వేళ
అసహనం
విద్వేషాన్నే రాజేస్తుంది
ప్రశ్నని చిదిమేసి
హేతువు గొంతు నొక్కేసిన నాడు
అహంస ఓ అనాధ
వాళ్ళు దేన్ని వొదిలారని
మట్టినా
మందునా
మాటల్లోనే తేడా
వైఖరి మారిందెక్కడ
బతుకు బాగుపడదు
ప్రగతి సుమం విరబూయదు
అప్పులు
అవసరాలు
వెంటాడుతున్నప్పుడు
కళ్లాలలో కల్లోలం
కాపురం చేస్తున్నప్పుడు
పాడెక్కినప్పుడు
పంట
మంట గలిసినప్పుడు
కరువు
ఎరువు
నెత్తిన దరువై
మోతెక్కిస్తున్నప్పుడు
పరపతి
విత్తులు
ఎరువులు
సమస్యలై
సంక్షోభాలై
సాక్షాత్కరిస్తున్నప్పుడు
దిగుబడికి
రాబడికి
లంకె కుదరనప్పుడు
కాడీ
మేడీ
పట్టడమే నేరమైన వేళ
ఎవరు తిరగ రాస్తారు
మా బతుకు పుస్తకాన్ని
కరిగిపోయినకలలు
ఆవిరై పోయిన ఆరోగ్యం
శిలువెక్కిన విలువలు
ఇక్కడ అభివృద్ధికి
అవినీతికి మధ్య పోటీ
పేదరికాన్ని కాదు
పేదల్ని ఏరేస్తున్నారు.
నింగికి ముద్దెట్టుకుంటానేలకి ముద్దెట్టుకుంటాగాలికి ముద్దెట్టుకుంటాగంగమ్మకి ముద్దెట్టుకుంటా ముచ్చటగా ఎగిరేఆ మువ్వన్నెల జెండాకిమూడు ముద్దులెట్టుకుంటానా గుండెకి హత్తుకుంటా భారత స్వాతంత్ర్య పోరాటంలోతెరమరుగున కనిపించని త్యాగమూర్తులెందరోనెత్తురిచ్చిదేశానికి విముక్తినిచ్చినోళ్ళకి వైఖరి మనిషితనం మాయమైన వేళఅసహనంవిద్వేషాన్నే రాజేస్తుంది ప్రశ్నని చిదిమేసిహేతువు గొంతు నొక్కేసిన నాడు అహంస ఓ అనాధ వాళ్ళు దేన్ని వొదిలారనిమట్టినా మందునామాటల్లోనే తేడావైఖరి మారిందెక్కడ బతుకు బాగుపడదు ప్రగతి సుమం విరబూయదు అప్పులు అవసరాలువెంటాడుతున్నప్పుడు కళ్లాలలో కల్లోలంకాపురం చేస్తున్నప్పుడుపాడెక్కినప్పుడుపంటమంట గలిసినప్పుడు కరువుఎరువు నెత్తిన దరువై మోతెక్కిస్తున్నప్పుడు పరపతి విత్తులుఎరువులుసమస్యలైసంక్షోభాలైసాక్షాత్కరిస్తున్నప్పుడు దిగుబడికి రాబడికి లంకె కుదరనప్పుడుకాడీమేడీపట్టడమే నేరమైన వేళ ఎవరు తిరగ రాస్తారుమా బతుకు పుస్తకాన్ని కరిగిపోయినకలలుఆవిరై పోయిన ఆరోగ్యం శిలువెక్కిన విలువలు ఇక్కడ అభివృద్ధికిఅవినీతికి మధ్య పోటీపేదరికాన్ని కాదుపేదల్ని ఏరేస్తున్నారు.
© 2017,www.logili.com All Rights Reserved.