మహాశయులకు,
నమస్కారం. హైందవ సంపదలో ఒక భాగం దేవాలయాలు. మన పూర్వీకులు అద్భుతమైన దేవాలయాలను ప్రయోగాత్మక రీతిలో నిర్మించినారు. వారి శిల్ప నైపుణ్యం, శిల్ప సంపద చరిత్రలో శాశ్వతంగా నిల్చినాయి. ఇవి భారతీయుల ఖ్యాతిని ప్రపంచ నలు దిశలకు వ్యాపింప జేసాయి. ఖండ ఖండాంతరాల నుంచి కళారాధకులను ఆకర్షించి, తమ వైభవాన్ని చాటుకున్నాయి. ముఖ్యముగా దక్షిణాది ప్రాంతము యొక్క ఆలయ నిర్మాణ శైలి ద్రావిడ సంస్కృతికి అద్దం పడతాయి. వైష్ణవాన్ని ఆరాధించిన ఆళ్వార్లు పెక్కు వైష్ణవ ఆలయాలను సందర్శించి, మంగళాశాసనములు గావించినారు. అటువంటి ఆలయాలు భూమి మీద 106 వరకు వున్నాయి. ఇవి దివ్యదేశాలుగా ఖ్యాతి పొందినాయి. వీటిని కొంతమంది దివ్య తిరుపతులుగా కొలుస్తారు. వీటి సమాచారం క్లుప్తంగానూ, భారత యాత్రా సమాచారం సమగ్రంగానూ, పొందుపరచుట జరిగింది. యాత్రా గైడ్ నందు చుట్టు ప్రక్కల గల పవిత్ర క్షేత్రాలు, యాత్రా స్థలాలు, పర్యాటక స్థలాలు మొదలగు చూడదగిన యాత్రా సమాచారం ఈ పుస్తకం నందు చోటు చేసుకున్నాయి.
- మంగపతి
మహాశయులకు, నమస్కారం. హైందవ సంపదలో ఒక భాగం దేవాలయాలు. మన పూర్వీకులు అద్భుతమైన దేవాలయాలను ప్రయోగాత్మక రీతిలో నిర్మించినారు. వారి శిల్ప నైపుణ్యం, శిల్ప సంపద చరిత్రలో శాశ్వతంగా నిల్చినాయి. ఇవి భారతీయుల ఖ్యాతిని ప్రపంచ నలు దిశలకు వ్యాపింప జేసాయి. ఖండ ఖండాంతరాల నుంచి కళారాధకులను ఆకర్షించి, తమ వైభవాన్ని చాటుకున్నాయి. ముఖ్యముగా దక్షిణాది ప్రాంతము యొక్క ఆలయ నిర్మాణ శైలి ద్రావిడ సంస్కృతికి అద్దం పడతాయి. వైష్ణవాన్ని ఆరాధించిన ఆళ్వార్లు పెక్కు వైష్ణవ ఆలయాలను సందర్శించి, మంగళాశాసనములు గావించినారు. అటువంటి ఆలయాలు భూమి మీద 106 వరకు వున్నాయి. ఇవి దివ్యదేశాలుగా ఖ్యాతి పొందినాయి. వీటిని కొంతమంది దివ్య తిరుపతులుగా కొలుస్తారు. వీటి సమాచారం క్లుప్తంగానూ, భారత యాత్రా సమాచారం సమగ్రంగానూ, పొందుపరచుట జరిగింది. యాత్రా గైడ్ నందు చుట్టు ప్రక్కల గల పవిత్ర క్షేత్రాలు, యాత్రా స్థలాలు, పర్యాటక స్థలాలు మొదలగు చూడదగిన యాత్రా సమాచారం ఈ పుస్తకం నందు చోటు చేసుకున్నాయి. - మంగపతి© 2017,www.logili.com All Rights Reserved.