మనకు ఎన్ని ఉన్నా ఎప్పుడూ ఎదో ఒక అశాంతి, బాధ మన జీవితాల్ని వెంటాడుతూనే ఉంటాయి. మన అసలు గమ్యం, లక్ష్యం తెలియక మనం పడే ఆరాట ఫలితమే ఇదంతా! అగమ్యగోచరంగా సాగే మన జీవితాలే కాదు, బాధా, దుఃఖమయమైన సమస్త మానవ జీవితాలన్నింటి వెనుక ఒదిగి ఆమూలాగ్రం వెల్లడించి, మన ఈ జీవితాలు సుఖలాలస కోసమో లేదా ముక్తి, మోక్షాల కోసమో కాదు - దివ్య పరిపూర్ణతను సిద్ధింప చేసుకొని దివ్య జీవనంగా మార్పు చెందించు కోవటానికేనని తెలియచెప్పిన మహనీయ ఆదర్శమూర్తులు, అతిమానస అవతారపురుషులు శ్రీమాతారవిందులు.
ఇంతటి మహోత్కృష్ట సత్యాలను వెల్లడించిన శ్రీమాతారవిందుల గురించిగాని, వారి యోగ, తత్త్వ, భోధనల గురించి గాని తెలుగునాట సరయిన అవగాహన లేదు. భారత స్వాతంత్రోద్యమంలో శ్రీ అరవిందుల పాత్ర గురించి ఒకింత అవగాహన లేదు. భారత స్వాతంత్రోద్యమంలో శ్రీ అరవిందుల గురించి సామాన్య తెలుగు ప్రజానీకానికి ఏమంత తెలియదనే చెప్పాలి. అలాగే శ్రీ అరవింద భక్తులు, సాధకులు, శ్రీ అరవిందాశ్రమం పిన్నా, పెద్దా యావన్మంది అత్యంత ప్రేమభావంతో పదే పదే ఉచ్చరించుకొనే 'అమ్మ' ను గురించి కూడా సామాన్య జనావళికి అసలేమి తెలియదనే చెప్పాలి. అంతరంగంలో తెలుసుకోవాలనే అభిలాష వున్నా తెలుగులో తేలికభాషలో గ్రంధాలు అంతగా అందుబాటులో లేకపోవడమే దానికి కారణం అనిపిస్తోంది. ఆ దిశగా ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతుండటం ఎంతో ఆనందదాయకం.
మానవ పరిణామ వికాసానికై తన నాల్గు ప్రముఖ శక్తులతో సామాన్య మానవమాత్రురాలిగా, సాధారణ స్త్రీ మూర్తిగా ఆవిర్భవించిన ఆ దివ్యజనని 'ఆధ్యాత్మిక వెలుగులు' తెలుగునాట ప్రసరిస్తే, మన జీవితాలు ధన్యమవుతాయనే తపనతో ఆశ్రమంలో ఆరోదృతి గారిని కలిసినప్పుడల్లా 'అమ్మ' గురించి తెలుగులో తేలిక భాషలో ఓ చిన్న గ్రంధం వ్రాయమని కోరడం జరుగుతుండేది. 'అమ్మ' ను గురించి మన తెలుగువారు తెలుసుకోవలసిన పుస్తకంగా తీసుకురావడం జరిగింది.
మనకు ఎన్ని ఉన్నా ఎప్పుడూ ఎదో ఒక అశాంతి, బాధ మన జీవితాల్ని వెంటాడుతూనే ఉంటాయి. మన అసలు గమ్యం, లక్ష్యం తెలియక మనం పడే ఆరాట ఫలితమే ఇదంతా! అగమ్యగోచరంగా సాగే మన జీవితాలే కాదు, బాధా, దుఃఖమయమైన సమస్త మానవ జీవితాలన్నింటి వెనుక ఒదిగి ఆమూలాగ్రం వెల్లడించి, మన ఈ జీవితాలు సుఖలాలస కోసమో లేదా ముక్తి, మోక్షాల కోసమో కాదు - దివ్య పరిపూర్ణతను సిద్ధింప చేసుకొని దివ్య జీవనంగా మార్పు చెందించు కోవటానికేనని తెలియచెప్పిన మహనీయ ఆదర్శమూర్తులు, అతిమానస అవతారపురుషులు శ్రీమాతారవిందులు. ఇంతటి మహోత్కృష్ట సత్యాలను వెల్లడించిన శ్రీమాతారవిందుల గురించిగాని, వారి యోగ, తత్త్వ, భోధనల గురించి గాని తెలుగునాట సరయిన అవగాహన లేదు. భారత స్వాతంత్రోద్యమంలో శ్రీ అరవిందుల పాత్ర గురించి ఒకింత అవగాహన లేదు. భారత స్వాతంత్రోద్యమంలో శ్రీ అరవిందుల గురించి సామాన్య తెలుగు ప్రజానీకానికి ఏమంత తెలియదనే చెప్పాలి. అలాగే శ్రీ అరవింద భక్తులు, సాధకులు, శ్రీ అరవిందాశ్రమం పిన్నా, పెద్దా యావన్మంది అత్యంత ప్రేమభావంతో పదే పదే ఉచ్చరించుకొనే 'అమ్మ' ను గురించి కూడా సామాన్య జనావళికి అసలేమి తెలియదనే చెప్పాలి. అంతరంగంలో తెలుసుకోవాలనే అభిలాష వున్నా తెలుగులో తేలికభాషలో గ్రంధాలు అంతగా అందుబాటులో లేకపోవడమే దానికి కారణం అనిపిస్తోంది. ఆ దిశగా ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతుండటం ఎంతో ఆనందదాయకం. మానవ పరిణామ వికాసానికై తన నాల్గు ప్రముఖ శక్తులతో సామాన్య మానవమాత్రురాలిగా, సాధారణ స్త్రీ మూర్తిగా ఆవిర్భవించిన ఆ దివ్యజనని 'ఆధ్యాత్మిక వెలుగులు' తెలుగునాట ప్రసరిస్తే, మన జీవితాలు ధన్యమవుతాయనే తపనతో ఆశ్రమంలో ఆరోదృతి గారిని కలిసినప్పుడల్లా 'అమ్మ' గురించి తెలుగులో తేలిక భాషలో ఓ చిన్న గ్రంధం వ్రాయమని కోరడం జరుగుతుండేది. 'అమ్మ' ను గురించి మన తెలుగువారు తెలుసుకోవలసిన పుస్తకంగా తీసుకురావడం జరిగింది.© 2017,www.logili.com All Rights Reserved.