ఏది చేయదగునో, ఏది చేయదగదో వివరించే మహత్ గ్రంథాలను అనేకులు మేధావులు రచించారు. కాని ప్రతి వ్యక్తీ తనకు ఎదురయ్యే ప్రత్రి పరిస్థితిలో ఈ నిర్ణయాన్ని తనకు తానే చేసుకోవలసి ఉంటుంది. ప్రతి వారికి తాము సరి బాటలోనే పయనిస్తున్నామనే నమ్మకం కావాలి. పొరబాటు చేశామేమోననే సందేహ భారం మోస్తూ బ్రతకడం కష్టం. ఒప్పే చేస్తున్నామనే దృఢ విశ్వాసం కలగాలంటే, తప్పొప్పులను నిర్ణయించే ప్రాతిపదిక స్పష్టంగా తెలియాలి. ఆ ప్రాతిపదికను మనమందు ఉంచుతుంది. భగవద్గీత. విషయాన్ని విషాదం చేసి నిర్ణయాన్ని మనకే వదలి వేస్తుంది. శాసించదు.
అయితే గీత అనేక శతాబ్దాల కిందటి భాషలో ఉంది. తరువాతి యుగాలలో ఎందరో మహానుభావులు దానికి తమతమ వ్యాఖ్యానాలను రాశారు. సైన్సు పెద్దపెద్ద అంగలు వేస్తూ పరుగులు తీస్తున్న నేడు, తర్కం, హేతువాదం, ప్రత్యక్ష ప్రమాణాలపై విశ్వాసం ప్రబలుతున్న కారణంగా ఈ గ్రంథం పై మరొకసారి దృష్టిని సారించి, ఆ మహాసూక్తులు నేటికీ ప్రస్తుతములే అని నిరూపించుకోవలసిన ఆవశ్యకత ఏర్పడింది. సైన్సు పరిచితులైన సామాన్యులకు, గీతలోని సత్యాలు నేటి మన జీవితపు విలువలకు కూడా ప్రాతిపదికలైన నిత్యసత్యాలేనని విశదపరచుటే ఈ చిన్న పుస్తకపు లక్ష్యం. దైనందిన జీవితంలో మన ప్రవర్తనలో గీత ఎలా మార్గదర్శనం చేస్తున్నదో క్లిష్టమైన ఆధ్యాత్మిక పరిభాషలో గాక మన భాషలో తెలియజెప్పే ప్రయత్నమే ఈ పుస్తకం.
ఏది చేయదగునో, ఏది చేయదగదో వివరించే మహత్ గ్రంథాలను అనేకులు మేధావులు రచించారు. కాని ప్రతి వ్యక్తీ తనకు ఎదురయ్యే ప్రత్రి పరిస్థితిలో ఈ నిర్ణయాన్ని తనకు తానే చేసుకోవలసి ఉంటుంది. ప్రతి వారికి తాము సరి బాటలోనే పయనిస్తున్నామనే నమ్మకం కావాలి. పొరబాటు చేశామేమోననే సందేహ భారం మోస్తూ బ్రతకడం కష్టం. ఒప్పే చేస్తున్నామనే దృఢ విశ్వాసం కలగాలంటే, తప్పొప్పులను నిర్ణయించే ప్రాతిపదిక స్పష్టంగా తెలియాలి. ఆ ప్రాతిపదికను మనమందు ఉంచుతుంది. భగవద్గీత. విషయాన్ని విషాదం చేసి నిర్ణయాన్ని మనకే వదలి వేస్తుంది. శాసించదు. అయితే గీత అనేక శతాబ్దాల కిందటి భాషలో ఉంది. తరువాతి యుగాలలో ఎందరో మహానుభావులు దానికి తమతమ వ్యాఖ్యానాలను రాశారు. సైన్సు పెద్దపెద్ద అంగలు వేస్తూ పరుగులు తీస్తున్న నేడు, తర్కం, హేతువాదం, ప్రత్యక్ష ప్రమాణాలపై విశ్వాసం ప్రబలుతున్న కారణంగా ఈ గ్రంథం పై మరొకసారి దృష్టిని సారించి, ఆ మహాసూక్తులు నేటికీ ప్రస్తుతములే అని నిరూపించుకోవలసిన ఆవశ్యకత ఏర్పడింది. సైన్సు పరిచితులైన సామాన్యులకు, గీతలోని సత్యాలు నేటి మన జీవితపు విలువలకు కూడా ప్రాతిపదికలైన నిత్యసత్యాలేనని విశదపరచుటే ఈ చిన్న పుస్తకపు లక్ష్యం. దైనందిన జీవితంలో మన ప్రవర్తనలో గీత ఎలా మార్గదర్శనం చేస్తున్నదో క్లిష్టమైన ఆధ్యాత్మిక పరిభాషలో గాక మన భాషలో తెలియజెప్పే ప్రయత్నమే ఈ పుస్తకం.© 2017,www.logili.com All Rights Reserved.