ప్రతిజీవి ముఖ్యంగా ప్రతి నాగరిక వ్యక్తీ ఎప్పుడు సంతోషంగానే జీవించాలనుకుంటాడు. తన నిజస్వరూపస్థితిలో ప్రతిజీవి శాశ్వతుడు ఆనందస్వరూపుడు కావడం వలన ఇది సహజం! ఏది ఏమైనా ప్రస్తుతం జీవి జననమరణచక్రంలో చిక్కుకుని ఉన్నాడు. అందుచేతనే అతడు సుఖాన్ని గాని, అమరత్వాన్ని గాని పొందలేక పోతున్నాడు. ఇతర గ్రహాలకు ప్రయాణం చేయాలని మనిషిలో కొత్తగా ఒక కోరిక రేకెత్తుతున్నది. సహజంగా భౌతిక ప్రపంచంలోని ఏ ప్రదేశానికైనా, ఆధ్యాత్మిక ఆకాశంలోని ఏ లోకానికైనా వెళ్ళే అధికారం అతనికి ఉంది గనుక ఆ కోరిక కూడా సమంజసమైందే. అలాంటి ప్రయాణం చాలా ఆకర్షణీయంగాను అద్భుతంగాను ఉంటుంది. ఎందుచేతనంటే ఆ ఆకాశాలన్నీ వివిధ లక్షణాలు కల అసంఖ్యాకామిన లోకాలతో నిండి ఉన్నాయి. అంతేకాదు ఆ లోకాలలో అన్ని రకాలైన జీవులున్నాయి. వాటిని చేరుకోవాలనే కోరిక యోగాభ్యాసం ద్వారా తీరగలదు.

© 2017,www.logili.com All Rights Reserved.