కాటూరి కవితానుశీలనం ద్వారా మంచి పరిశోధకుడన్న ముద్ర వేయించుకున్న మిత్రులు శ్రీ పింగళి వెంకట కృష్ణారావు గారు తన 'వామన వృక్షకావ్యం' వల్ల కవి అని కూడా అనిపించుకున్నారు. ఖండ కావ్యసంపుటి అయిన యీ 'కవితాకృష్ణ' తో మంచి కవి అనే అర్హత కూడా సంపాదించుకున్నారు. 'మంచి' అంటే నా అభిప్రాయం వస్తువును హృదయనేత్రంతో దర్శించి మనసు కదిలి తాను పొందిన భావానుభూతిని పాఠకునికి రసానుభూతిగా పరిణమింపజేసేవాడని. విభిన్న విషయాలమీద సాగిన ఈ ఖండ కావ్యాలన్నీ తాదృశ్యమైన లక్షణాన్ని కలిగి ఉన్నవే.
కృష్ణారావు గారి వస్తువివేచనం బహు ముఖీనం. ఆధ్యాత్మిక విషయాల నుండి అభాగ్యజీవుల దాకా ఎన్నో విభిన్న విషయాల్ని ఆక్రమించింది. వాటి వాటి ఆత్మతత్వాన్ని సాక్షాత్కరింపజేసింది. 'వాగీశ్వరి' ఖండంలో ఈయన వేదాంత విషయ పరిజ్ఞానం అప్రమేయంగా సాగింది. 'భిక్షువరీయసీ' లో వస్తుతత్వం సాక్షాత్కరిస్తుంది. ఇక 'వృషభవిలాపం' ఈ ఖండకావ్యాల్లో తలమానికం అని చెప్పవచ్చు. మూగజీవాల మనోవేదనని తన ఊహాదర్పణంలో దర్శింపజేసుకుని దాన్ని అక్షర రూపంలో జేయటం రచయితకు ఉత్తమకవి బిరుదుని సంపాదించి పెడుతున్నది. నిజమైన కవి తాను రసదృష్టితో దర్శించే ఏ వస్తువైనా అయిపోతాడు. 'సత్కవి ధరింపరాని వేషములు గలవే' అనే సిద్ధాంతం.
కాటూరి కవితానుశీలనం ద్వారా మంచి పరిశోధకుడన్న ముద్ర వేయించుకున్న మిత్రులు శ్రీ పింగళి వెంకట కృష్ణారావు గారు తన 'వామన వృక్షకావ్యం' వల్ల కవి అని కూడా అనిపించుకున్నారు. ఖండ కావ్యసంపుటి అయిన యీ 'కవితాకృష్ణ' తో మంచి కవి అనే అర్హత కూడా సంపాదించుకున్నారు. 'మంచి' అంటే నా అభిప్రాయం వస్తువును హృదయనేత్రంతో దర్శించి మనసు కదిలి తాను పొందిన భావానుభూతిని పాఠకునికి రసానుభూతిగా పరిణమింపజేసేవాడని. విభిన్న విషయాలమీద సాగిన ఈ ఖండ కావ్యాలన్నీ తాదృశ్యమైన లక్షణాన్ని కలిగి ఉన్నవే. కృష్ణారావు గారి వస్తువివేచనం బహు ముఖీనం. ఆధ్యాత్మిక విషయాల నుండి అభాగ్యజీవుల దాకా ఎన్నో విభిన్న విషయాల్ని ఆక్రమించింది. వాటి వాటి ఆత్మతత్వాన్ని సాక్షాత్కరింపజేసింది. 'వాగీశ్వరి' ఖండంలో ఈయన వేదాంత విషయ పరిజ్ఞానం అప్రమేయంగా సాగింది. 'భిక్షువరీయసీ' లో వస్తుతత్వం సాక్షాత్కరిస్తుంది. ఇక 'వృషభవిలాపం' ఈ ఖండకావ్యాల్లో తలమానికం అని చెప్పవచ్చు. మూగజీవాల మనోవేదనని తన ఊహాదర్పణంలో దర్శింపజేసుకుని దాన్ని అక్షర రూపంలో జేయటం రచయితకు ఉత్తమకవి బిరుదుని సంపాదించి పెడుతున్నది. నిజమైన కవి తాను రసదృష్టితో దర్శించే ఏ వస్తువైనా అయిపోతాడు. 'సత్కవి ధరింపరాని వేషములు గలవే' అనే సిద్ధాంతం.© 2017,www.logili.com All Rights Reserved.