అందమైన పదముల కూర్పుతో, వాటిని తాళమునకు ఒదిగించు నేర్పుతో రసభావములను నింపి గేయరచన చేయటంలో కృతకృత్యులు కావటమనేది అందరికి అమరే విషయం కాదు. కూచిపూడి నృత్య రూపక చక్రవర్తుల కృష్ణమాచార్యులు ప్రసిద్ధులు. పింగళి వెంకట కృష్ణారావు గారి 'రూపకవేణి' చదివిన తరువాత ఆ కోవలో మరొక కవి కూచిపూడికి రూపక రచయితగా లభించాడనిపించింది.
నృత్యనాటకాల రచన చేసేవారికి సంగీత, సాహిత్య నాట్యాలమీద అవగాహన బాగా ఉంటే కాని రాణింప చేకూరదు. ఈ విషయంలో పింగళివారిని కొనియాడక తప్పదు. ఈ 'రూపకవేణి' లో వరూథినీ ప్రవరాఖ్యం, బాలధ్రువ, 'బుద్ధం శరణం గచ్చామి', స్వామి వివేకానంద అనే నాలుగు రూపకాలున్నాయి. ఏ ఇతివృత్తానికా ఇతివృత్తం చక్కగా రూపకాలుగా అమరాయి.
అందమైన పదముల కూర్పుతో, వాటిని తాళమునకు ఒదిగించు నేర్పుతో రసభావములను నింపి గేయరచన చేయటంలో కృతకృత్యులు కావటమనేది అందరికి అమరే విషయం కాదు. కూచిపూడి నృత్య రూపక చక్రవర్తుల కృష్ణమాచార్యులు ప్రసిద్ధులు. పింగళి వెంకట కృష్ణారావు గారి 'రూపకవేణి' చదివిన తరువాత ఆ కోవలో మరొక కవి కూచిపూడికి రూపక రచయితగా లభించాడనిపించింది. నృత్యనాటకాల రచన చేసేవారికి సంగీత, సాహిత్య నాట్యాలమీద అవగాహన బాగా ఉంటే కాని రాణింప చేకూరదు. ఈ విషయంలో పింగళివారిని కొనియాడక తప్పదు. ఈ 'రూపకవేణి' లో వరూథినీ ప్రవరాఖ్యం, బాలధ్రువ, 'బుద్ధం శరణం గచ్చామి', స్వామి వివేకానంద అనే నాలుగు రూపకాలున్నాయి. ఏ ఇతివృత్తానికా ఇతివృత్తం చక్కగా రూపకాలుగా అమరాయి.© 2017,www.logili.com All Rights Reserved.