కవిరాజ శిఖామణి నన్నెచోడుడు వ్రాసిన కుమార సంభవ కావ్యాన్ని వచన కావ్యంగా అను సృజన చేశారు శ్రీ పింగళి వేంకట కృష్ణారావు గారు. అనుసృజన అంటే మక్కీకి మక్కీ అనువాదం కాదు. అనుసరించి చేసిన సృష్టి. ఈ రచన చదవటం మొదలుపెట్టినప్పుడు, ఇది ఒక నవలలాగా ఉన్నదే అనిపించింది. వర్ణనలు కథాకథనము చూచినప్పుడు ఇది ఒక ప్రబంధమా అనిపించింది. ఎక్కడా ఇది అనువాదమనిపించలేదు. ఒక స్వతంత్ర రచన అనిపించింది. పూర్వం ఈ కావ్యానికి అనుసరణలు అనువాదలు రాకపోలేదు. కాని ఈ గ్రంథం సామాన్యులకు కూడా చదివించే కథాకథనశైలిలో హాయిగా ఒకరికొకరు మాట్లాడుకుంటున్నట్లున్నది.
ఈ కథలో గణపతి జననం విచిత్రం. పార్వతి నలుగుపిండితో బొమ్మను చేసి ప్రాణం పోయటం, ఆ బాలుడు శివుని అడ్డగించగా శిరసు ఖండించటం, ఆ తరువాత గజాసురుని తల అతికించటం మొదలైన వృత్తాంతానికి భిన్నంగా నన్నెచోడుడు, గజరూపాల్లో పార్వతీ పరమేశ్వరులు క్రీడించగా నీలవర్ణంతో గజాననుడు జన్మించినట్లు రచించాడు. గజక్రీడను చూసి పార్వతీ పరమేశ్వరులు రమించగా గజాననుడు జన్మించినట్లు పింగళివారు మార్పు చేశారు. ఇది సముచితంగా ఉన్నది. ఆ గణపతికి నీలగణపతి అని పేరు పెట్టడం కూడా బాగున్నది.
కవిరాజ శిఖామణి నన్నెచోడుడు వ్రాసిన కుమార సంభవ కావ్యాన్ని వచన కావ్యంగా అను సృజన చేశారు శ్రీ పింగళి వేంకట కృష్ణారావు గారు. అనుసృజన అంటే మక్కీకి మక్కీ అనువాదం కాదు. అనుసరించి చేసిన సృష్టి. ఈ రచన చదవటం మొదలుపెట్టినప్పుడు, ఇది ఒక నవలలాగా ఉన్నదే అనిపించింది. వర్ణనలు కథాకథనము చూచినప్పుడు ఇది ఒక ప్రబంధమా అనిపించింది. ఎక్కడా ఇది అనువాదమనిపించలేదు. ఒక స్వతంత్ర రచన అనిపించింది. పూర్వం ఈ కావ్యానికి అనుసరణలు అనువాదలు రాకపోలేదు. కాని ఈ గ్రంథం సామాన్యులకు కూడా చదివించే కథాకథనశైలిలో హాయిగా ఒకరికొకరు మాట్లాడుకుంటున్నట్లున్నది. ఈ కథలో గణపతి జననం విచిత్రం. పార్వతి నలుగుపిండితో బొమ్మను చేసి ప్రాణం పోయటం, ఆ బాలుడు శివుని అడ్డగించగా శిరసు ఖండించటం, ఆ తరువాత గజాసురుని తల అతికించటం మొదలైన వృత్తాంతానికి భిన్నంగా నన్నెచోడుడు, గజరూపాల్లో పార్వతీ పరమేశ్వరులు క్రీడించగా నీలవర్ణంతో గజాననుడు జన్మించినట్లు రచించాడు. గజక్రీడను చూసి పార్వతీ పరమేశ్వరులు రమించగా గజాననుడు జన్మించినట్లు పింగళివారు మార్పు చేశారు. ఇది సముచితంగా ఉన్నది. ఆ గణపతికి నీలగణపతి అని పేరు పెట్టడం కూడా బాగున్నది.© 2017,www.logili.com All Rights Reserved.