సంభవం
బుల్ డోజర్లూ, క్రేన్లూ రొద చేసుకుంటూ వెళ్లి హోటల్ ఇంపీరియల్ ముందాగాయి. అప్పటికే అక్కడికి నగర టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఝాన్సీ తన సిబ్బందితో వచ్చి ఉంది. హోటల్లో బస చేసిన వారినీ, సిబ్బందినీ బయటికి వచ్చేయమని మైకులో పదే పదే హెచ్చరిస్తోంది. పోలీసులు లోపలికెళ్ళి హోటల్ ఖాళీ చేసేందుకు తోడ్పడుతున్నారు. -
లోపల్నుంచి జనం ఎలా ఉన్నవారు అలాగే సామాన్లు చేత బట్టి ఉరుకులు పరుగులు మీద బయటికొస్తున్నారు
మునిసిపల్ సిబ్బందే కాదు, రక్షణ కోసం వచ్చిన పోలీసులు సైతం సంకోచిస్తూనే అయిష్టంగానే హోటల్ని ఖాళీ చేయిస్తున్నారు.
లోపలెవరూ లేరని నిర్ధారణ చేసుకున్న వెంటనే బుల్ డోజర్ల డ్రైవర్లకు సూచనలిచ్చింది ఝాన్సీ. వాటితో బాటు క్రేన్లు కూడా కదలి హోటల్ భవనం దగ్గరకు వెళ్లాయి.
అక్కడ పోగైన జనం సంభ్రమాశ్చర్యాలతో 'ఇది కలా, నిజమా' అన్నట్టు చూస్తున్నారు.
ఇంతలో సర్రున దూసుకొచ్చిందో బీఎమ్ డబ్ల్యూ కారు. అందులోంచి కోపోద్రిక్తులై బుసలు కొడుతూ దిగారు ఆ హోటల్ అధిపతి భూపతి, అతడి కొడుకు లక్ష్మీపతి.
“ఏయ్. ఆగాగు. ఏమిటీ పిచ్చిపని?” ఝాన్సీ మీదకు దూసుకెళ్ళాడు భూపతి. “హైకోర్టు ఉత్తర్వుని అమలు చేస్తున్నాను”
" "కోర్టు ఆర్డరిస్తే సరిపోతుందా? నన్ను సంప్రదించ వద్దా? నేనీ ప్రాంత అధికార పార్టీ ఎమ్మెల్యేని. నా పవరేంటో నీకు తెలిసినట్టు లేదు” అని భూపతి అంటే,
“మేడమ్ కొత్తగా వచ్చారు కదా. మన ఆతిథ్యమూ తెలీదు, మన తడాఖా తెలీదు..." నవ్వాడు పక్కనే ఉన్న లక్ష్మీపతి.
“నాకు కోర్టు ఉత్తర్వు తప్ప మిగతావి అనవసరం. చెరువుని కట్టా చేసి కట్టిన ఈ హోటల్నీ, ఈ పక్కనే ఉన్న రిసార్ట్స్ నీ, అనధికార పార్కింగ్ లాట్స్న తొలగించడానికొచ్చాం . దయచేసి మాకు అడ్డు రావద్దు” ధీమాగా చెప్పింది ఝాన్సీ
"ఏయ్ ఊరికే డబడబ వాగకు, పోయి కమీషనర్నీ మేయర్నీ అడుగు. వారెవరికీ డా ఇంత పెద్ద బిల్డింగ్ కట్టాననుకుంటున్నావా పిచ్చిదానా? అందరికీ తెలిసే ఈ..................
సంభవం బుల్ డోజర్లూ, క్రేన్లూ రొద చేసుకుంటూ వెళ్లి హోటల్ ఇంపీరియల్ ముందాగాయి. అప్పటికే అక్కడికి నగర టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఝాన్సీ తన సిబ్బందితో వచ్చి ఉంది. హోటల్లో బస చేసిన వారినీ, సిబ్బందినీ బయటికి వచ్చేయమని మైకులో పదే పదే హెచ్చరిస్తోంది. పోలీసులు లోపలికెళ్ళి హోటల్ ఖాళీ చేసేందుకు తోడ్పడుతున్నారు. - లోపల్నుంచి జనం ఎలా ఉన్నవారు అలాగే సామాన్లు చేత బట్టి ఉరుకులు పరుగులు మీద బయటికొస్తున్నారు మునిసిపల్ సిబ్బందే కాదు, రక్షణ కోసం వచ్చిన పోలీసులు సైతం సంకోచిస్తూనే అయిష్టంగానే హోటల్ని ఖాళీ చేయిస్తున్నారు. లోపలెవరూ లేరని నిర్ధారణ చేసుకున్న వెంటనే బుల్ డోజర్ల డ్రైవర్లకు సూచనలిచ్చింది ఝాన్సీ. వాటితో బాటు క్రేన్లు కూడా కదలి హోటల్ భవనం దగ్గరకు వెళ్లాయి. అక్కడ పోగైన జనం సంభ్రమాశ్చర్యాలతో 'ఇది కలా, నిజమా' అన్నట్టు చూస్తున్నారు. ఇంతలో సర్రున దూసుకొచ్చిందో బీఎమ్ డబ్ల్యూ కారు. అందులోంచి కోపోద్రిక్తులై బుసలు కొడుతూ దిగారు ఆ హోటల్ అధిపతి భూపతి, అతడి కొడుకు లక్ష్మీపతి. “ఏయ్. ఆగాగు. ఏమిటీ పిచ్చిపని?” ఝాన్సీ మీదకు దూసుకెళ్ళాడు భూపతి. “హైకోర్టు ఉత్తర్వుని అమలు చేస్తున్నాను” " "కోర్టు ఆర్డరిస్తే సరిపోతుందా? నన్ను సంప్రదించ వద్దా? నేనీ ప్రాంత అధికార పార్టీ ఎమ్మెల్యేని. నా పవరేంటో నీకు తెలిసినట్టు లేదు” అని భూపతి అంటే, “మేడమ్ కొత్తగా వచ్చారు కదా. మన ఆతిథ్యమూ తెలీదు, మన తడాఖా తెలీదు..." నవ్వాడు పక్కనే ఉన్న లక్ష్మీపతి. “నాకు కోర్టు ఉత్తర్వు తప్ప మిగతావి అనవసరం. చెరువుని కట్టా చేసి కట్టిన ఈ హోటల్నీ, ఈ పక్కనే ఉన్న రిసార్ట్స్ నీ, అనధికార పార్కింగ్ లాట్స్న తొలగించడానికొచ్చాం . దయచేసి మాకు అడ్డు రావద్దు” ధీమాగా చెప్పింది ఝాన్సీ "ఏయ్ ఊరికే డబడబ వాగకు, పోయి కమీషనర్నీ మేయర్నీ అడుగు. వారెవరికీ డా ఇంత పెద్ద బిల్డింగ్ కట్టాననుకుంటున్నావా పిచ్చిదానా? అందరికీ తెలిసే ఈ..................© 2017,www.logili.com All Rights Reserved.