భారతీయులందరకూ శిరోధార్యములైన గ్రంధములు మూడు కలవు మొదటిది రామాయణ మహాకావ్యము, రెండవది భారతేతిహాసము, మూడవది భాగవత పురాణము.
పసినాటినుండియు తల్లిదండ్రులు తమ బిడ్డలకి గాధలు చెప్పుట మన దేశమున ఆనవాయితీగా వచ్చుచున్నది కానీ, అధునాతన కాలమున యేర్పడిన జీవన వేగము వలననూ, ఇతరేతములైన వివిధ కారణములు చేతను ఆ పరంపరా కథన మించక వెనుకబడినది. ఇట్టి సమయములో , పిల్లలు తమకు తాముగా ఆ దివ్యగ్రంధములను పరిచయము చేసుకొనుటకుగాను అనువైన భాషలో ప్రచురించుట ఆవశ్యమని తలంచితిమి.
పిల్లలకు ఉత్సుకత కలిగించుటకొరకై - నడుమ చక్కని చిత్రములను గీయించినాము. వర్ణమాల క్షుణ్ణముగా వచ్చిన పిల్లలకు కులంకుషముగా అర్ధమగు రీతిలో తేటతెలుగు శైలిలో ఆ గ్రంధములను వ్రాయించి ముద్రించుచున్నాము.