'శ్రీ లలితా సహస్రనామస్తోత్రం... ఒక శాస్త్రం'. ఉపాసనారహస్యాలు, ఉపనిషద్విజ్ఞానం - ఈ రెండింటి ప్రకాశమే ఈ స్తోత్రమంతా. ప్రతినామం ఒక విద్యాసూత్రం. ఉపాసనకు 'విద్య' అని పేరు. ఇది 'బ్రహ్మవిద్య'యే. ఈ కారణం చేతనే ఈ గ్రంథం 'శ్రీలలితావిద్య' అనే నామాన్ని ధరించింది.
అనేక భాష్యాలను, తత్సంబంధిత శాస్త్రాలను అధ్యయనం చేయడంతో పాటు గురుకృప, దేవీ ప్రేరణల వలన స్పురించిన భావాలను మేళవించి, సంప్రదాయజ్ఞుల అనుమతితో, శాస్త్రం విధించిన పరిమితులను, నియమాలను అతిక్రమించకుండా కేవలం ధర్మభక్తి జ్ఞాన సంస్కారాలతో అమ్మవారి వైభవాన్ని ఆవిష్కరించడమే ఇందులో జరిగింది.
సగుణ నిర్గుణ బ్రహ్మతత్త్వ ప్రతిపాదన ఈ వాజ్మయం. ఆ పరమసత్యాన్నే ఈ గ్రంథం చాటి చెప్తోంది.
ఇది 'భావనాగమ్యా'కు నివేదించుకున్న భావనా ప్రధాన భాష్య గ్రంథం. సహృదయ పాఠకులకు దీని పఠనం కూడా భావార్చనగానే ఉపకరిస్తుంది.
శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంపై అనేక భాష్యాలున్నాయి.... మరి ఈ పుస్తకం దేనికి? అనే ప్రశ్నకు సమాధానం ఈ పుస్తకమే..
- సామవేదం షణ్ముఖ శర్మ
'శ్రీ లలితా సహస్రనామస్తోత్రం... ఒక శాస్త్రం'. ఉపాసనారహస్యాలు, ఉపనిషద్విజ్ఞానం - ఈ రెండింటి ప్రకాశమే ఈ స్తోత్రమంతా. ప్రతినామం ఒక విద్యాసూత్రం. ఉపాసనకు 'విద్య' అని పేరు. ఇది 'బ్రహ్మవిద్య'యే. ఈ కారణం చేతనే ఈ గ్రంథం 'శ్రీలలితావిద్య' అనే నామాన్ని ధరించింది. అనేక భాష్యాలను, తత్సంబంధిత శాస్త్రాలను అధ్యయనం చేయడంతో పాటు గురుకృప, దేవీ ప్రేరణల వలన స్పురించిన భావాలను మేళవించి, సంప్రదాయజ్ఞుల అనుమతితో, శాస్త్రం విధించిన పరిమితులను, నియమాలను అతిక్రమించకుండా కేవలం ధర్మభక్తి జ్ఞాన సంస్కారాలతో అమ్మవారి వైభవాన్ని ఆవిష్కరించడమే ఇందులో జరిగింది. సగుణ నిర్గుణ బ్రహ్మతత్త్వ ప్రతిపాదన ఈ వాజ్మయం. ఆ పరమసత్యాన్నే ఈ గ్రంథం చాటి చెప్తోంది. ఇది 'భావనాగమ్యా'కు నివేదించుకున్న భావనా ప్రధాన భాష్య గ్రంథం. సహృదయ పాఠకులకు దీని పఠనం కూడా భావార్చనగానే ఉపకరిస్తుంది. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంపై అనేక భాష్యాలున్నాయి.... మరి ఈ పుస్తకం దేనికి? అనే ప్రశ్నకు సమాధానం ఈ పుస్తకమే.. - సామవేదం షణ్ముఖ శర్మ© 2017,www.logili.com All Rights Reserved.