భగవద్విభూతిని పుణికిపుచ్చుకున్న వృక్షరాజం తులసి. పూజార్హమైన పత్రంగా పురాతన వ్యాధినివారక ఔషదంగా అనాదికాలం నుంచీ తులసీ వైభవాన్ని ఎరుగనివారు లేరు. ముఖ్యంగా దక్షిణాదిన తులసికోట లేని ఇల్లు ఉందనడం అతిశయోక్తి కాదు. సర్వవర్ణాలవారికీ ఆరాధ్య దేవత శ్రీ తులసిమాత. మహాలక్ష్మి అంశంగా పరిగణింపబడే తులసిని గూర్చి వివిధ గాధలు అష్టాదశ పురాణాలలోను లభ్యం అవుతున్నాయి.
వేదవర్ణితములైన వనౌషధులలో తులసి అగ్రభాగాన నిలుస్తున్నది. కృత యుగంలో లక్ష్మిదేవి అంశంగా 'లక్ష్మి తులసి', త్రేతాయుగంలో శ్రీరాముని స్తుతిగా 'రామ తులసి' ద్వాపరయుగంలో శ్రీకృష్ణుని కరస్పర్శచే పునీతమైందిగా 'కృష్ణ తులసి' అనే మూడు రకాల పవిత్ర తులసితో పాటు - రుద్రాజడ తులసి, నేల తులసి, మరువక తులసి, అడవి తులసి అనే ఇంకో 4 రకాలు కూడా ఉన్నాయి. ప్రధానమైన ఈ ఏడు రకాలనే వివిధ ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో వ్యవహరిస్తున్నారు. ఇంకా విలువైన విశేషాలు, నిత్యపూజా విధులు, అరుదైన స్తోత్రాలు, ఆయుర్వేద చికిత్సల గురించి తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవండి.
భగవద్విభూతిని పుణికిపుచ్చుకున్న వృక్షరాజం తులసి. పూజార్హమైన పత్రంగా పురాతన వ్యాధినివారక ఔషదంగా అనాదికాలం నుంచీ తులసీ వైభవాన్ని ఎరుగనివారు లేరు. ముఖ్యంగా దక్షిణాదిన తులసికోట లేని ఇల్లు ఉందనడం అతిశయోక్తి కాదు. సర్వవర్ణాలవారికీ ఆరాధ్య దేవత శ్రీ తులసిమాత. మహాలక్ష్మి అంశంగా పరిగణింపబడే తులసిని గూర్చి వివిధ గాధలు అష్టాదశ పురాణాలలోను లభ్యం అవుతున్నాయి. వేదవర్ణితములైన వనౌషధులలో తులసి అగ్రభాగాన నిలుస్తున్నది. కృత యుగంలో లక్ష్మిదేవి అంశంగా 'లక్ష్మి తులసి', త్రేతాయుగంలో శ్రీరాముని స్తుతిగా 'రామ తులసి' ద్వాపరయుగంలో శ్రీకృష్ణుని కరస్పర్శచే పునీతమైందిగా 'కృష్ణ తులసి' అనే మూడు రకాల పవిత్ర తులసితో పాటు - రుద్రాజడ తులసి, నేల తులసి, మరువక తులసి, అడవి తులసి అనే ఇంకో 4 రకాలు కూడా ఉన్నాయి. ప్రధానమైన ఈ ఏడు రకాలనే వివిధ ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో వ్యవహరిస్తున్నారు. ఇంకా విలువైన విశేషాలు, నిత్యపూజా విధులు, అరుదైన స్తోత్రాలు, ఆయుర్వేద చికిత్సల గురించి తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవండి.© 2017,www.logili.com All Rights Reserved.