అశాశ్వతమైన వస్తువులను, విషయాలను గ్రహించిన మానవుడు, శాశ్వతమైనదేదో వుందని ఉహించాడు. అతి బలమైన ప్రకృతి శక్తుల ముందు మానవుడు బలహీనుడు, అసమర్ధుడు, ప్రకృతిని చూసి ఒకసారి ఆశ్చర్యపడతాడు. ఆనందిస్తాడు. ఇంకొకసారి భయపడిపోతాడు. భవిష్యత్తు మీద ఆందోళనకే కాక, ఆశ కుడా వుంటుంది. ఈ ద్వైదీభావం వలననే మనిషికి మతపరమైన ఆలోచనలకు భూమిక ఏర్పడింది.... ఆది మానవునికి నిద్ర, మృత్యువులకు సంబంధించిన విషయాలపై అర్ధం కాని తత్త్వం అలౌకిక శక్తుల మీద విశ్వాసం కలగజేసి ఉంటాయి....
హిందువులకు మానవుని జీవితం పునరపి జననం పునరపి మరణం. ఈ సంసార చక్రం మోక్షం లభించేవరకు సాగుతూనే వుంటుంది. మోక్షం ఒక్క జీవిత కాలంలోనే సాధ్యం కాదు. మోక్షానికి అందరూ అర్హులే కానీ దానికోసం చిత్తశుద్దితో సాధన చేయాలి. దేవుని నివాసాలైన ఆలయాలు మనిషి జ్ఞానం సంపాదించడానికి ఉపకరించే సాధనాలు. గుడి అన్నది... మనిషిలోని ఆధ్యాత్మికతను పెంపొందించి మోక్ష దిశగా తయారుచేస్తుంది. ఇటువంటి గుళ్ళూ - గోపురాల గురించి ఈ పుస్తకం మీకు తెలియజేస్తుంది.
అశాశ్వతమైన వస్తువులను, విషయాలను గ్రహించిన మానవుడు, శాశ్వతమైనదేదో వుందని ఉహించాడు. అతి బలమైన ప్రకృతి శక్తుల ముందు మానవుడు బలహీనుడు, అసమర్ధుడు, ప్రకృతిని చూసి ఒకసారి ఆశ్చర్యపడతాడు. ఆనందిస్తాడు. ఇంకొకసారి భయపడిపోతాడు. భవిష్యత్తు మీద ఆందోళనకే కాక, ఆశ కుడా వుంటుంది. ఈ ద్వైదీభావం వలననే మనిషికి మతపరమైన ఆలోచనలకు భూమిక ఏర్పడింది.... ఆది మానవునికి నిద్ర, మృత్యువులకు సంబంధించిన విషయాలపై అర్ధం కాని తత్త్వం అలౌకిక శక్తుల మీద విశ్వాసం కలగజేసి ఉంటాయి.... హిందువులకు మానవుని జీవితం పునరపి జననం పునరపి మరణం. ఈ సంసార చక్రం మోక్షం లభించేవరకు సాగుతూనే వుంటుంది. మోక్షం ఒక్క జీవిత కాలంలోనే సాధ్యం కాదు. మోక్షానికి అందరూ అర్హులే కానీ దానికోసం చిత్తశుద్దితో సాధన చేయాలి. దేవుని నివాసాలైన ఆలయాలు మనిషి జ్ఞానం సంపాదించడానికి ఉపకరించే సాధనాలు. గుడి అన్నది... మనిషిలోని ఆధ్యాత్మికతను పెంపొందించి మోక్ష దిశగా తయారుచేస్తుంది. ఇటువంటి గుళ్ళూ - గోపురాల గురించి ఈ పుస్తకం మీకు తెలియజేస్తుంది.© 2017,www.logili.com All Rights Reserved.